సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టు .. లేనిది ఉన్నట్లు కల్పించే జనాలు ఎక్కువైపోతున్నారు . అంతేకాదు మనం ఒకటి చూసాము .. అంటే అందులో మంచి కన్నా చెడు ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు . పాపులారిటీ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు ఏదైనా ఉంది అంటే అది అల్లు ఫ్యామిలి అని చెప్పాలి . అల్లు అర్జున్ తీసుకున్న ఒక్క డెసిషన్ తో అల్లు ఫ్యామిలీ గ్రాఫ్ మొత్తం డౌన్ అయిపోయింది .
ఏకంగా పుష్ప2 సినిమానే వాయిదా వేసుకున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారయిందో అర్థం చేసుకోవచ్చు . కాగా తాజాగా క్లిం కార ఫస్ట్ బర్త డే సెలబ్రేషన్స్ బాగా జరిగాయి . ఈ బర్త్డ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి . అయితే ఈ పిక్స్ లో ఎక్కడ స్నేహ రెడ్డి లేకపోవడం అందరికి షాకింగ్ అనిపిస్తుంది . ఆ కుటుంబంలో ఫస్ట్ వారసురాలు మరి ఆమె ఫస్ట్ బర్త డే కి అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరు కాకపోవడమేంటి ..అసలు మెగా ఫ్యామిలీ పిలవలేదు అన్న న్యూస్ కూడా వైరల్ అవుతుంది.
అన్ని పనుల్లో చకచకా ముందుండే స్నేహ రెడ్డి మెగా ఫ్యామిలీలో జరిగిన ఫస్ట్ ఈవెంట్ మిస్ అవ్వడం ఇదే . దీంతో సోషల్ మీడియాలో ఇది అల్లు ఫ్యామిలీకి జరిగిన ఘోర అవమానం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే కొంతమంది మాత్రం వాళ్లు అసలు వచ్చారో రాలేదో తెలియదు .. కొన్ని కారణాల చేత రాలేకపోయి ఉండొచ్చు .. ఇలా ఎందుకు వాళ్ళ పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు..!