ప్రస్తుతానికి ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలామంది నటీ,నటులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడే యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన సినీ అప్డేట్లను పర్సనల్ అప్డేట్లను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఒకరు. వరుస సినిమాలతో ఓ పక్కన బిజీగా ఉంటేనే.. మరో పక్కన ఇన్‌స్‌టా వేదికగా ఎప్పటికప్పుడు తన అప్డేట్లను షేర్ చేసుకుంటూ ఉంటాడు. తనపై వచ్చిన విమర్శలకు, ట్రోల్స్ కు తనదైన శైలిలో స్పందిస్తూ వారి నోళ్ళు మూయిస్తాడు.
ఇలా గతంలో సినిమాల కంటే కూడా ఎక్కువగా వివాదాల కారణంగా నెటింట వైరల్ గా మారాడు విశ్వక్. దీంతో కొంతకాలం కాంట్రవర్షియల్ హీరో అంటూ విశ్వక్ పేరు మారుమోగిపోయింది. ఇలాంటి క్రమంలో విశ్వక్ ఇన్‌స్టా అకౌంట్‌ను డిలీట్ చేసినట్లు కనిపిస్తుండడంతో.. అభిమానులకు భారీ షాక్ తగిలినట్లు అయింది. తాజాగా విశ్వక్ తన ఇన్‌స్టాలో ఓ స్టోరీని షేర్ చేసుకున్నాడు. సోషల్ మీడియా నుంచి దూరం అవుతున్నట్లు అందులో వివరించాడు. కొన్ని రోజులు పోస్ట్ పెట్టరేమో అని అంతా అనుకున్నారు. కానీ అసలు ఇన్‌స్టా అకౌంట్ లేకుండా డిలీట్ చేసేసాడు ఈ యంగ్ హీరో. దీంతో కారణం ఏమై ఉంటుంది అనే అనుమానం అభిమానులో మొదలైంది.
ఇదే అంశంపై ఎక్స్‌లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూ ఇచ్చే వారిపై విశ్వక్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తన ఇన్‌స్టాలో పోస్ట్ షేర్ చేస్తూ.. ఓ యూట్యూబ్ ఛానల్ కల్కి రిలీజ్ కాకుండానే రివ్యూ ఇవ్వడాన్ని తప్పుపడుతూ మాట్లాడాడు. ఈ వివాదం నెటింట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతోనే సోషల్ మీడియాకు పూర్తిగా దూరమవ్వాలని ఉద్దేశంతో విశ్వక్.. తన ఇన్‌స్టా ఎకౌంటు డిలీట్ చేసి ఉంటాడు అంటూ.. నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.