కల్కి విషయంలో ఆ వ్యక్తిపై కోపంలో ప్రభాస్ ఫ్యాన్స్.. బండ బూతులతో అతని ఆడేసుకుంటున్నారుగా..?!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సినిమాలకు నెగటివ్ రివ్యూలు ఇచ్చే విషయంలో.. కాంట్రవర్సీ కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ఉమైర్ సంధు ఎప్పుడు మొదటి వరుసలో ఉంటాడు అన్న సంగతి తెలిసింది. మొదటి నుంచి ప్రభాస్ సినిమాలకు ఉమైర్ సంధు నెగిటివ్ రివ్యూ ఇస్తూ.. ఎప్పుడు ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆగ్ర‌హ‌నికి గురవుతూనే ఉంటాడు. ఇక గతంలో తను ఇచ్చిన ఒకటి, రెండు రివ్యూ నిజం కావడంతో అప్పటి నుంచి ప్రభాస్ ప్రతి సినిమాకు నెగిటివ్ రివ్యూలను ఇవ్వడం ప్రారంభించాడు. ఇలాంటి క్రమంలో తాజాగా రిలీజ్ అయిన కల్కి సినిమాకు కూడా సంధు నెగటివ్ రివ్యూ ఇచ్చాడు. ఈ రివ్యూ నిజం కాకపోవడంతో.. ప్రభాస్ అభిమానులంతా ఉమైర్ సంధును బండ బూతులు తిడుతూ ఆడిపోసుకుంటున్నారు.

Umair Sandhu Disaster Report Tweets|Kalki 2898Ad|Prabhas|What If Stories

కల్కి స్టైల్ విషయంలో హై, లో ఉందని.. సబ్స్టేన్స్ విషయంలో తక్కువగా ఉందని.. ఉమైర్‌ రివ్యూలో వివరించాడు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదంటూ చెప్పుకొచ్చాడు. కల్కి మూవీ ప్రేక్షకులను నిరోత్సాహానికి గురిచేస్తుంది అంటూ వివరించాడు. ప్రభాస్, దీపికల బ్యాడ్ లక్ అంటూ చెప్పుకొచ్చాడు. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవంటూ రివ్యూ లో వివరించాడు. ఇలాంటి క్రమంలో తను చెప్పిన ఒక్క రివ్యూ కూడా నెటిజన్ల‌ నుంచి వినిపించలేదు. సినిమా చూసిన దాదాపు అందరూ ఆడియన్స్ పాజిటివ్ టాక్‌తో రివ్యూలు ఇవ్వడంతో.. ప్రభాస్ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ఇక కల్కి 2898 ఏడి సినిమా హక్కులను భారీ స్థాయిలో కొనుగోలు చేసిన ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది.

Star heroines file a case against controversial film critic

ఫస్ట్ వీకెండ్ సమయానికి చాలా థియేటర్లలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది అంటూ సినీ ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కల్కి 2898 ఎడి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సంచలనం అంటూ తెలుగు సినీ ఖ్యాతిని హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో మరింతగా నాగ్‌ అశ్విన్ పెంచాడంటూ ఈ జనరేషన్ ఆడియన్స్ అభిరుచికి అనుకూలంగా సినిమాను తెరకెక్కించాడంటూ నెటింట కామెంట్లు వినిపిస్తున్నాయి. కల్కి 2898 ఏడి ప్రభాస్ సినిమా పై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను అందుకోవడమే కాదు.. అంతకంటే మరింత ఎక్కువగా హైప్‌ క్రియేట్ చేసింది. సినిమా రూ.700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా.. ఆ బడ్జెట్‌కు న్యాయం జ‌రిగేలా సినిమా తెర‌కెక్కించాడు నాగ్ అశ్విన్‌.ఇక రాబోయే రోజుల్లో ఈ స్టార్ డైరెక్ట‌ర్ ఎలాంటి స్టార్స్ తో సినిమాలు చేస్తాడో వేచి చూడాలి.