టైం బాగా లేకపోతే ఎలాంటి పనులైనా చేయాలి .. అది ఎవరికైనా తప్పదు ..ఆ విషయం అందరికీ తెలిసిందే ..మనలో చాలామంది కూడా అలాంటి సిచువేషన్స్ ఫేస్ చూస్తూ ఉంటారు . కాగా రీసెంట్ గా హీరోయిన్ శ్రీలీల తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వైరల్ గా కూడా మారిపోయింది . కన్నడ బ్యూటీనే అయినప్పటికీ తెలుగులో మంచి మంచి రోల్స్ పట్టేసి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రీ లీల .
తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా చక్రం తిప్పేసింది. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ప్రజెంట్ ఆమె స్టామినా తగ్గిపోయింది . ఆమె క్రేజ్ ఢమాల్ అంటూ పడిపోయింది . దానికి కారణం పలు సినిమాలలో ఆమె క్యారెక్టర్ లేకపోయినా కేవలం హీరోల క్రేజ్ కోసమే నటించడమే. ఆ కారణంగానే పలువురు శ్రీ లీలను ఏకీపారేశారు . అయితే శ్రీ లీల తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది.
ఇన్నాళ్లు హీరోయిన్స్ పాత్రలు మాత్రమే చేయాలనుకున్న శ్రీలీల ఇప్పుడు సెకండ్ హీరోయిన్ పాత్రను కూడా చేయడానికి సిద్ధంగా ఉందట . అంతేకాదు స్టార్ హీరోకి చెల్లెలు స్టార్ హీరోకి కూతురు పాత్రలో కూడా నటించడానికి సిద్ధపడుతుందట ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు. మన కర్మ మన దగ్గర ఎలాంటి పనులైనా చేయిస్తుంది అంటూ నీతి వ్యాఖ్యలు చేస్తున్నారు..!!