వామ్మో..నాగ చైతన్యకి లక్ ఈ రేంజ్ లో కలిసి వచ్చేసింది ఏంటి..? జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిన అక్కినేని వారసుడు..!!

అదృష్టం.. ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరు చెప్పలేరు.. అది అందరికీ తెలిసిన సత్యమే. కొన్ని కొన్ని సార్లు అదృష్టం మనకి చెప్పకుండా మనకు హింట్ ఇవ్వకుండా మన లైఫ్ లోకి వచ్చేస్తుంది. ప్రజెంట్ నాగచైతన్య లైఫ్ లోకి అదృష్టం వచ్చినట్లు బాగా తెలుస్తుంది . అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా ..అక్కినేని నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ప్రజెంట్ తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే విరూపాక్ష డైరెక్టర్ తో మరొక సినిమాకి కమిటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇప్పుడు నాగచైతన్య ఖాతాలో మరో బిగ్ డైరెక్టర్ వచ్చి చేరినట్లు తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు నాగ్ అశ్వీన్. ఎస్ ప్రజెంట్ కల్కి సినిమాతో చరిత్ర తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్నాడు నాగ్ అశ్విన్. ఇప్పుడు ఆయన నాగచైతన్య సినిమా కమిట్ అయ్యాడు అన్న వార్త వైరల్ గా మారింది. దానికి కారణం రీసెంట్ గా కల్కి సినిమాలోని బుజ్జి వెహికల్ నాగచైతన్య డ్రైవ్ చేయడమే .

టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య బుజ్జి పై మనసు పారేసుకున్నట్లు ఉన్నాడు. మొదటి నుంచి కార్లు అంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే . అయితే కల్కి సినిమాలోని బుజ్జి పై మనసు పారేసుకున్న నాగచైతన్య ఏకంగా బుజ్జితో కలిసి ఒక సూపర్ ఫాస్ట్ రైడ్ కూడా వెళ్లారు. దీనికి సంబంధించిన చిన్న వీడియో ప్రోమో ని కూడా కల్కి మేకర్స్ నెట్టింట షేర్ చేయగా అది సెకండ్స్ లోనే వైరల్ గా మారింది. అంతేకాదు వీళ్ళ కాంబోలో ఓ సినిమా రాబోతుంది అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. దీంతో నాగచైతన్య కెరియర్ లో బిగ్ బ్లాక్ బస్టర్ కన్ఫామ్ అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??