“ఈ విషయం మీతో పంచుకోవడం నాకు హ్యాపీగా ఉంది”.. గుడ్ న్యూస్ షేర్ చేసిన రష్మిక మందన్నా..!

రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే ఓ స్టార్ హీరోయిన్ . అమ్మడు గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అంతకు డబుల్ రేంజ్ లో ట్రోలింగ్ కి కూడా గురవుతుంది. కానీ రష్మిక మందన్నా మాత్రం అలాంటివి పెద్దగా ఏమీ పట్టించుకోరు . తన పని తనది అన్నట్టు చూసుకొని వెళ్ళిపోతుంది . ప్రజెంట్ రష్మిక మందన్నా పుష్ప2 సినిమా షూట్స్ లో బిజీగా ఉంది .

అంతేకాదు బాలీవుడ్ లో మూడు క్రేజీ ప్రాజెక్టులకు కమిట్ కూడా అయింది . రష్మిక మందన్నా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు అభిమానలను ఆకట్టుకుంటుంది . “నేను ఎప్పుడు వెతికిన నా చుట్టూ బొచ్చు మాత్రమే దొరుకుతూ ఉంటుంది .. అయినా వీటితో టైం స్పెండ్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది . ఇవి ఇచ్చే సంతోషం నాకు మరి ఎవ్వరు ఇవ్వలేరు.. వీటికి సంబంధించిన కొన్ని లవ్లీ మూమెంట్స్ మీతో పంచుకోవాలని అనుకున్నాను అందుకే ఈ ఫోటోలను షేర్ చేశాను” అంటూ చెప్పుకొచ్చింది.

రష్మిక మందన్నా పంచుకున్న ఈ క్యూట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . రష్మిక కి అనిమల్స్ అంటే ఇంత ఇష్టమా..? ఇంత పెట్ లవరా..? అంటూ షాక్ అయిపోతున్నారు. రష్మిక మందన్నా ఫ్యాన్స్ ఆమెకు సంబంధించిన ఈ ఫొటోస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు. కాగా త్వరలోనే రష్మిక ..తారక్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది..!!