“కల్కి” సినిమా దేవర-పుష్ప2కు పెద్ద గుణపాఠం కానుందా? చచ్చిన ఇక ఆ పని చేయరు..!

ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తుస్సు మంటూ డిజాస్టర్ గా మారిపోతున్నాయి. ఆ విషయం మనం చూస్తూనే ఉన్నాము. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టిన సినిమాలు కనీసం 100కోట్లు రూపాయలు కూడా కలెక్ట్ చేయకుండానే అభిమానులను నిరాశ పరుస్తున్నాయి . ఎటువంటి ఎక్ష్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచిగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి . రీసెంట్గా సోషల్ మీడియాలో కల్కి సినిమాకి సంబంధించి ఎలా నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుందో మనం చూసాం.

ఒక ఈవెంట్ కోసమే నాగ్ అస్వీన్ 40 కోట్లు ఖర్చు చేశారు . ఇది దారుణాతి దారుణం అంటూ కూడా పలువురు మండిపడ్డారు . కల్కి సినిమా కోసం సుమారు 770 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతుంది . అయితే ఈ సినిమాపై మాత్రం అనుకున్నంత హ్యూజ్ పబ్లిసిటీ రాలేకపోయింది. ఇప్పుడు ఇదే విషయం దేవర .. అదే విధంగా పుష్ప2 సినిమాలను టెన్షన్ పెట్టే విధంగా మారిపోయింది .

దేవర-పుష్ప2 కూడా భారీ బడ్జెట్లో తెరకెక్కబోతున్నాయి. అయితే ఈ సినిమాల విషయంలో కూడా హై బడ్జెట్ తో ప్రమోషన్స్ చేసి చిక్కుల్లో పడడం కన్నా ఉన్న కంటెంట్ ని జెన్యూన్ గా ప్రమోట్ చేసుకోవడం మంచిది అంటున్నారు సినీ విశ్లేషకులు . లేనిపోని ఆడంబరాలకు పోయి సినిమా ఖర్చులను పెంచేయకుండా ఉంటే మంచిది అంటూ సజెస్ట్ చేస్తున్నారు సినీ విశ్లేషకులు. మరి చూదద్దాం ఈ సినీ మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..??