మళ్లీ ఆ తెలుగు హీరోతో కలిసి నటించబోతున్న జ్యోతిక ..వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఇది..!

జ్యోతిక .. ఫస్ట్ ఇన్నింగ్స్ లో తన అంద చందాలతో సినీ ఇండస్ట్రీని కట్టుపడేసిన హీరోయిన్.. కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగు – హిందీ భాషలో కూడా పలు సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీ కే బాగా కమిట్ అయిపోయింది . అక్కడ స్టార్ హీరోయిన్గా మారిపోయింది . కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఫ్యామిలీ లైఫ్ ను ముందుకు తీసుకెళ్లింది . రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో జెట్ స్పీడ్ లో కొనసాగుతుంది జ్యోతిక . కాగా ఆమె బాలీవుడ్ లో నటించిన సైతాన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయింది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాగా జ్యోతిక ఇప్పుడు తెలుగులో తన సెకండ్ ఇన్నింగ్ సినిమాను స్టార్ట్ చేసింది అన్న వార్త వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి చేసిన ఠాగూర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న జ్యోతిక .. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోను ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట.

విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్న చిరంజీవి .. ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో నటించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా జ్యోతికను చూస్ చేసుకుంటున్నారట. చిరంజీవి ఏజ్ కి జ్యోతిక ఏజ్ కి బాగా మ్యాచ్ అవుతుంది అని అదే విధంగా ఈ కాన్సెప్ట్ ప్రకారం జ్యోతిక మాత్రమే హైలెట్ గా పర్ఫార్మ్ చేస్తుంది అని డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో ఈ న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!