ఈ మధ్యకాలంలో హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం కామన్ గా మారిపోయింది . ప్రజెంట్ ఇప్పుడు ఒక హిట్ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అన్న వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలకు నాంది పలికిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అప్పటివరకు కేవలం ఒక స్టార్ హీరో ఒక సినిమాలో నటించి హిట్లు కొడుతూ వచ్చారు. అయితే ఎప్పుడైతే శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ మూవీ అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను తెరకెక్కించారు .
ఆ సినిమాలో అన్న పాత్రలో వెంకటేష్ తమ్ముడు పాత్రలో మహేష్ బాబును చూసుకొని హిట్ అందుకున్నారు . అప్పటినుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ పరంపర కొనసాగుతుంది అంటూ వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో.. దిల్ రాజు సరైన హిట్ కొట్టిన మూవీనే లేదు. రీసెంట్ గా లవ్ మీ సినిమా కూడా దారుణంగా దెబ్బేసింది . ఈ క్రమంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి సీక్వెల్ రావాలి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా లేటెస్ట్ జనరేషన్ హీరో హీరోయిన్లు తీసుకుంటే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా కుర్ర హీరోలైన విజయ్ దేవరకొండ – నాని అదే విధంగా మమితా బైజు.. శ్రీ లీల లాంటి హీరోయిన్స్ తీసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు . ఏమో మరి దీనిపై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం..?