హరీష్ శంకర్ మాస్ డెసీషన్.. ఒక్క దెబ్బతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడుగా..!!

ఎలాంటి డేరింగ్ డెసిషన్ అయినా తీసుకోవడంలో పూరి జగన్నాథ్ తర్వాత ఆ స్థాయిని అందుకున్న డైరెక్టర్ ఎవరు అంటే మాత్రం హరీష్ శంకర్ అని చెప్పక తప్పదు. హరిష్ శంకర్ తీసుకున్న డెసిషన్స్ ఎంత బోల్డ్ గా ఉంటాయో.. ఎంత కరెక్ట్ గా ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా హరిష్ శంకర్ ప్రజెంట్ ఒక స్టార్ హీరోతో సినిమాకి కమిట్ అయ్యాడు అన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే హరీష్ శంకర్ కెరియర్ ని టర్న్ చేసిన సినిమా గబ్బర్ సింగ్ . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

ఇప్పుడు ఉస్తాత్ భగత్ సింగ్ సినిమాని కూడా కమిట్ అయ్యాడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో.. ఆ సినిమా త్వరలోనే సెట్స్ పైకి కూడా రాబోతుంది . ప్రజెంట్ రాజకీయ పనుల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక హరీష్ శంకర్ టైం తీసుకుంటున్నాడు. రవితేజ తో కలిసి మిస్టర్ బచ్చన్ అనే సినిమాను కూడా తెరకెక్కించేశారు . కాగా ఇప్పుడు హరీష్ శంకర్ మరో మాస్ హీరోతో సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

ఆయన మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాం పోతినేని . నిజానికి స్కంధ సినిమా తర్వాత రామ్ తో సినిమా తెరకెక్కించడానికి ఏ డైరెక్టర్ కూడా సాహసం చేయడం లేదు . కానీ హరీష్ శంకర్ మాత్రం ఓ అద్భుతమైన మాస్ ఎంటర్టైనింగ్ కథతో రామ్ పోతినేనితో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు అని ఆ సినిమాకి కమిట్ అయిపోయాడు అని వార్తలు వినిపిస్తున్నాయి . సడన్గా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం ఆ డెసిషన్ ని అమల్లోకి తీసుకురావడం హరిష్ శంకర్ కి పెద్ద కొత్త కాదు . దీంతో హరీష్ శంకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!