ఎన్టీఆర్ ని తొక్కేయాలని చూస్తున్న స్టార్ హీరో ..పి ఆర్ టీం తో అలాంటి చెత్త పనులు చేయిస్తున్నాడా..?

ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ ని ఎలా ట్రోల్ చేస్తున్నారో జనాలు మనం బాగా గమనిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ గురించి ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అవ్వకపోయేసరికి ఆయన పేరు నానా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ఓటు వేయడానికి బ్లూ కలర్ షర్ట్ లో రావడంతో ఆయన ఓ పార్టీకి మద్దతు పలుకుతున్నారు అంటూ యాంటీ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు . రీసెంట్గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొందరు విష్ చేయడం పట్ల కొందరు పెద్ద వ్యక్తులు ఎలా ఎన్టీఆర్ను దూషించారో కూడా మనం చూశాం.

తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించిన మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ని తొక్కేయడానికి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి అంటూ ఓ వార్త ట్రెండ్ అవుతుంది. కావాలనే ఎన్టీఆర్ దేవర ఫియర్ సాంగ్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అని .. ఎన్టీఆర్ ని సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోనికుండా చేస్తున్నారు అని .. ఆ హీరో తన బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ తో పిఆర్టి టీం ను ఉపయోగించుకుంటూ ఫియర్ సాంగ్ పై నెగిటివ్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు అని.. డబ్బులు ఇచ్చి మరి దేవర సినిమాను ఫ్లాప్ చేయడానికి నెగిటివ్ కామెంట్స్ పెట్టిస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది .

దీని పట్ల నందమూరి ఫ్యాన్స్ కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవర సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు ఎన్టీఆర్ ఇన్ని జరుగుతున్న సైలెంట్ గా ఉండడం ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కి కూడా అర్థం కాని అయోమయస్థితిని క్రియేట్ చేసింది . కానీ పలువురు మాత్రం ఎన్టీఆర్ మంచితనం వల్లే ఇలాంటి వాళ్లు విర్రవీగుతున్నారు అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . చూద్దాం ఎన్టీఆర్ మౌనం దేవర సినిమాకు ప్లస్ అవుతుందో..? మైనస్ అవుతుందో..?