మోక్షజ్ఞ ఆయన దగ్గర క్లాసెస్ తీసుకుంటున్నాడా..? బాలయ్య పెద్ద స్కెచే వేశాడుగా…!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్న న్యూస్ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ . నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడెప్పుడు వస్తుందా ..? అంటూ కోట్లాదిమంది నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్గా మోక్షజ్ఞ ఎంట్రీ పై అఫీషియల్ గా స్పందించాడు బాలకృష్ణ . టాలీవుడ్ మాస్ కా దాస్ హీరో విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా మోక్షజ్ఞ ఎంట్రీ పై మాట్లాడి నందమూరి అభిమానులకి ఫుల్ జోష్ నింపాడు బాలయ్య.

కాగా ఇదే క్రమంలో బోయపాటి దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటూ ఫిక్స్ అయిపోయారు నందమూరి అభిమానులు . అంతేకాదు తాజాగా సోషల్ మీడియాలో వార్త బాగా వైరల్ అవుతుంది. బాలయ్య తన కొడుకుకి మంచి నటన స్కిల్స్ రావడానికి ఇండస్ట్రీలోనే తోపు పైన డైరెక్టర్ దగ్గర వద్ద యాక్టింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నారట. ఆశ్చర్యం ఏంటంటే.. ఆ విషయాన్ని సీక్రెట్ గా దాచుతున్నాడట బాలయ్య .

నందమూరి బాలయ్య తన కొడుకు భవిష్యత్తు కోసం బాగా బాగా కష్టపడుతున్నాడు అన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతుంది. చూద్దాం మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో ..?ఎవరితో ఉంటుందో..? ఎలాంటి హిట్ అందుకుంటాడో..? అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య కొడుకు ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు..!!