ఫస్ట్ టైం ఆ విషయంలో బిగ్ టెన్షన్ పడుతున్న ఎన్టీఆర్.. ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా బాగా వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయంలో టెన్షన్ పడుతున్నారా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్కి గురైంది . ఎంతలా అంటే చాలా చాలా దారుణంగా మాటలు వినిపించే అంత స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ట్రోలింగ్ కి గురైంది . రీసెంట్గా తన బర్త్డ డే ను చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ .

అయితే జూనియర్ ఎన్టీఆర్ పై హ్యూజ్ ట్రోలింగ్ జరగడం ఇప్పుడు ఫాన్స్ కు ఇబ్బందికరంగా మారింది. దేవర సినిమా నుంచి ఫియర్ సాంగ్ రిలీజ్ చేశాడు కొరటాల . అయితే ఈ సాంగ్ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది . ఏదో ఇంగ్లీష్ సాంగ్ లా ఉందే కానీ తెలుగు జనాలను మరీ ముఖ్యంగా నందమూరి అభిమానులను సాటిస్ఫై చేసే రేంజ్ లో లేదు . ఈ వీడియో కింద చాలామంది నందమూరి ఫ్యాన్స్ కూడా దెబ్బేశావ్ అన్న అంటూ కామెంట్స్ పెట్టారు .

ఇప్పుడు ఆ కామెంట్స్ నందమూరి హీరోకి కొత్త టెన్షన్ క్రియేట్ చేసినట్లు తెలుస్తుంది . నెక్స్ట్ సాంగ్స్ విషయంలో చాలా కేర్ఫుల్ గా తెలుగు జనాలు ఆకట్టుకునే విధంగా ఉండేలా అనిరుధ్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు దేవరతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమా ని కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు..!!