అయ్యయ్యో .. జాన్వి కపూర్ కి ఆ పిచ్చి ఉందా..? ఉదయం లేవగానే మొదటి చేసేది అదేనా..?

జాన్వి కపూర్ .. బాలీవుడ్ బ్యూటీ.. అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు ఎన్నో సినిమాల్లో నటించింది . కానీ క్రేజీ హిట్ మాత్రం కొట్టలేకపోయింది . మరి ముఖ్యంగా జాన్వీ కపూర్ తెలుగులో ఎన్టీఆర్ సినిమాతో డెబ్యూ ఇస్తూ ఉండడం హైలైట్ గా మారింది. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ దేవర అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ద్వారానే తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మరొక సినిమాకి కూడా కమిట్ అయిపోయింది .

రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వం లో తెరకెక్కే సినిమాలోను హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది. జాన్వి కపూర్ తాజాగా ఓ విషయాన్ని బయటపెట్టింది . తాను జ్యోతిష్యాలను బాగా నమ్ముతాను అని చెప్పుకొచ్చింది . అంతేకాదు ఉదయం నిద్ర లేస్తే మొదటగా తన రాశి ఎలా ఉంది అనే విషయాన్ని చూయించుకుంటుందట. ఆ తర్వాతే తన డే ని స్టార్ట్ చేస్తుందట. కొన్నిసార్లు తన రాసి బాగోలేదు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుందట.

తన రాశిలో జరిగిన విధంగానే తన లైఫ్ లో జరుగుతుంది అని నమ్మకం జాన్వి కపూర్ కి ఉంటుందట . అందుకే ప్రతి రోజు తన జాతకాన్ని తన రాశి ఎలా ఉంది అనే విషయాన్ని చెక్ చేసుకుంటుందట . సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ ఇలాంటివి నమ్మరు ..ఒకవేళ నమ్మిన బయటకు చెప్పరు .. కానీ జాన్వి కపూర్ మాత్రం ఇలా ఉన్నది ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేసింది . దీనితో సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ పేరు మారుమ్రోగిపోతుంది..!!