సురేఖకు కొడుకు చరణ్ కంటే ఆ మెగా హీరో అంటేనే ఎక్కువ ఇష్టమా.. ఇంతకీ అతనెవరంటే..!!

టాలీవుడ్ మెగాస్టార్ గా చిరంజీవికి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిరంజీవి.. తన కుటుంబం నుంచి ఎంతోమంది యంగ్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాదు.. ఓ మెగా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి సతీమణి సురేఖకు కూడా ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది. చాలామంది తన గురించి పాజిటివ్గా చెబుతూ ఉంటారు. ఎవరో నూటికి ఒక్కరి ఇద్దరు మాత్రమే ఆమెలోని నెగిటివ్ విషయాలను మాట్లాడతారు.

Ram Charan wishes mom Surekha on her birthday, shares adorable pics - India  Today

ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేసుకుంటూ అభిమానులకు దగ్గరవుతున్నారు సురేఖ‌. అయితే తాజాగా సురేఖకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. అదేంటంటే సురేఖకు కొడుకు రామ్ చరణ్ కంటే వరుణ్ తేజ్ సినిమాలంటేనే చాలా ఇష్టమట. అతని సినిమాలనే ఎక్కువగా ఇష్టపడతారట. తాను ఎంపిక చేసుకునే సినిమాలు వైవిధ్యమైన కథ ఉంటుందని.. వరుణ్ యాక్టింగ్ చాలా వెరైటీగా ఉంటుందని సురేఖ కుటుంబ సభ్యుల వద్ద మాట్లాడుతూ ఉంటారట. ఏ తల్లి అయినా తన కొడుకే టాప్ హీరోగా ఉండాలని భావిస్తుంది.

Varun Tej reveals he was anxious about Ghani's delay due to COVID-19: 'It  is a producer's call…' | Telugu News - The Indian Express

కానీ సురేఖ మాత్రం అలా కాదు.. ఆమె మైండ్ సెట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. టాలెంట్ ఎక్కడ ఉంటే వారిని సురేఖ ఎంకరేజ్ చేస్తుందట. అందుకే రామ్ చరణ్ సినిమాలోనైనా మిస్ అవుతుందేమో కానీ.. వరుణ్ తేజ్ సినిమాలను మాత్రం అసలు మిస్ కాకుండా ప్రతి సినిమాను థియేటర్కు వెళ్లి చూసేందుకు ప్రయత్నిస్తుందట. వరుణ్ తేజ్ నటించిన అన్ని సినిమాను ఆమె ఎంజాయ్ చేస్తుందట. చాలా విషయాల్లో చరణ్ కంటే వరుణ్ తేజ్‌కు ఆమె ఎక్కువ సపోర్ట్ అందిస్తుందట. ఇలా టాలెంట్ ను బట్టి మనిషిని ప్రోత్సహించే ఆమె వ్యక్తిత్వాన్ని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.