100% లవ్ సినిమాకి సీక్వెల్ రాబోతుందోచ్.. హీరో – హీరోయిన్లు ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ పరంపర ఎక్కువగా చూస్తున్నాం . గతంలో తెరకెక్కిన సినిమాలకు సీక్వెల్ పేరుతో మళ్లీ అదే కథను అటు ఇటుగా మార్చి తెరకెక్కించడం చాలా కామన్ అయిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే అలా తెరకెక్కిన సినిమాలు హిట్ అవుతూ ఉండడం గమనార్హం . రీసెంట్గా నాగచైతన్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన 100% లవ్ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

నాగచైతన్య హీరోగా తమన్న హీరోయిన్గా నటించారు . అయితే ఈ సినిమాకి వచ్చే సీక్వెల్లో మాత్రం నాగచైతన్య హీరోగా హీరోయిన్గా మాత్రం శ్రీ లీలను చూస్ చేసుకుంటున్నారట మేకర్స్ . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడట. దీంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.

ప్రజెంట్ నాగచైతన్య టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది . ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమా కోసం నాగచైతన్య బాగా బాగా కష్టపడుతున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నాగ చైతన్య మరో సినిమా కి కూడా కమిట్ అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది..!!