ఆ హీరోయిన్ రియల్ క్యారెక్టర్ ఇదే.. వరలక్ష్మి శరత్ కుమార్ పై నిర్మాత కామెంట్స్ వైరల్..?!

కోలీవుడ్ స్టార్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ లోనూ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులోనూ చాలా సినిమాల్లో కీలకపాత్రలో నటించి ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. తెలుగులో యశోద, హనుమాన్, విరసింహారెడ్డి, క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది. త్వరలో సబ‌రి సినిమాతో హీరోయిన్గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇక తాజాగా జరిగిన మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో వరలక్ష్మి శరత్ కుమార్ పై మూవీ ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ గుండ్లు చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారాయి. అయన వరలక్ష్మి శరత్ కుమార్ ఒరిజినల్ బిహేవియర్ ఇదే అంటూ ఆసక్తికర విషయం షేర్ చేసుకున్నాడు. సినిమా గురించి మాట్లాడుతూ ఈమె బయట ఎలా ఉంటారో చెప్తాను అంటూ నిర్మాత మాట్లాడారు. మేము షూటింగ్ టైంలో కడైకెనాల్లో 100 మందితో 15 రోజులు వర్షంలో సీన్ తీయాలని నిర్ణయించుకున్నాం. కానీ వరలక్ష్మి నేను రైన్ సీన్లలో నటించిన అని కో డైరెక్టర్ తో చెప్పారట.

అయితే తర్వాత 100 మందితో ప్లాన్ చేసిన భారీ సీన్ అని తెలియడంతో.. ఆమె చేయాలేదంటే ఎంతో లాస్ అవుద్ది. ఆయన ఏమైపోతారు అని ఆలోచించి.. వెంటనే ఆ సన్నివేశానికి ఓకే చెప్పారట‌. నిర్మాతల గురించి కూడా ఆలోచించే గొప్ప ఆర్టిస్టులు చాలా త‌క్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఆమె ఒకటి. ఆమెది చాలా మంచి మనసు అంటూ వరలక్ష్మి గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ప్రొడ్యూసర్ గుడ్ బిహేవియర్ అంటూ వివ‌రించాడు. సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రొడ్యూసర్ వరలక్ష్మీపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.