ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. టెలివిజన్ లో ప్రభాస్ సలార్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలను నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చివరిగా ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా సలార్ సినిమా తెర‌కెక్కిన‌ సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రీయ రెడ్డి, ఈశ్వరీ రావు తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు.

గత ఏడాది తెలుగు, హిందీలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడంతో సంచలనాన్ని సృష్టించింది. అంతేకాదు సినిమా ఓటిటి స్ట్రీమింగ్‌లో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. వరల్డ్ వైడ్ టెలివిజన్ ప్రీమియర్‌కి టైం ఫిక్స్ అయ్యింది.

సలార్ ఈనెల 21న అంటే వచ్చే ఆదివారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు స్టార్ మా లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తాజాగా మూవీ టీం ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అలాగే ఎప్పటి నుంచే సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులంతా ఈ న్యూస్ తెలియడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు.