యాంకర్ ప్రదీప్ చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్స్.. ఇంతకీ ఏం చేశాడంటే..?!

బుల్లితెరప్ స్టార్ యాంకర్ ప్రదీప్ మాచరాజుకు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏళ్ల తరబడి మేల్ యాంకర్ గా తిరుగులేని ఆదిపత్యాన్ని ప్రదర్శించిన ప్రదీప్.. గడసరి అత్త సోగ‌సరి కోడలు షో ద్వారా మంచి ఫ్రేమ్ సంపాదించుకున్నాడు. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, ఢీ డ్యాన్స్ రియాలిటీ షో లాంటి సక్సెస్ఫుల్ షోలకు యాంకర్ గా వ్యవహరించి పాపులర్ అయ్యాడు. ప్రదీప్ మాచరాజు సెలబ్రిటీ గానే కాదు.. కొన్ని వివాదాలను ఎదుర్కొని సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆయన దొరికిపోవడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి బయటకు వదిలారు.

అప్పుడు తన తప్పు ఒప్పుకొని ఇకపై చేయనని ప్రదీప్ మాచిరాజు క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన కొన్ని లైంగిక ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ అమ్మాయి పై లైంగిక దాడి చేశారంటూ ప్రదీప్ మాచిరాజు పేరును బయట పెట్టడంతో ఆయన పేరు వివాదంగా మారింది. అయితే ఆమె అబద్ధం చెప్పిందని తేలడంతో ప్రదీప్ కు రిలీఫ్ వచ్చింది. ఈ వివాదంలో పలువురు టీవీ సెలబ్రిటీస్ ప్రదీప్ కు మద్దతుగా నిలిచారు. ఇక ప్రదీప్ తన సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని ఎప్పుడు దానం చేస్తూనే ఉంటాడట. కాగ‌ గతంలో ఓ యంగ్ సింగర్‌ను తానే చదివిస్తానని చదువు బాధ్యతలు నేను చూసుకుంటానంటూ ప్రామిస్ చేశాడట.

ఆయన ఇచ్చిన ప్రామిస్ ను నిలబెట్టుకున్నాడని తాజాగా ఆ సింగర్ స్వయంగా వివరించాడు. యంగ్ సింగర్ పవన్ కళ్యాణ్ గతంలో సరిగమప షోలో పాల్గొని సందడి చేశాడు. పవన్ కళ్యాణ్ ఆర్థిక ఇబ్బందులు తెలుసుకున్న ప్రదీప్ తన చదువుకు అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తానంటూ హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ప్రదీప్‌ను బీటెక్ చదువు పూర్తయ్యే వరకు తన ఫీజు మొత్తాన్ని ఆయనే చెల్లించాడని.. ప్రదీప్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. దీంతో ప్రస్తుతం ప్రదీప్ చేసిన మంచి పని నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ప్రదీప్ చేసిన ఈ పనికి ప్రేక్ష‌కులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్ర‌దీప్ కొంత‌కాలంగా యాంకరింగ్ కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ప్రదీప్ హీరోగా సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.