సూర్య లో నాకు అసలు నచ్చని క్వాలిటీ అదే.. జ్యోతిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..

కొలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతికలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి తమ కంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ జంట.. గత కొంతకాలంగా నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఈ జంట విడిపోతున్నారంటూ.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగానే.. జ్యోతిక ముంబైకి షిఫ్ట్ అయిపోయిందంటూ.. పిల్లల కారణంగానే ఇంకా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు అంటూ.. ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ ఈ జంట క్లారిటీ ఇచ్చేశారు. జ్యోతిక పలుమార్లు ఇన్ డైరెక్ట్ గా స్పందిస్తూ.. ఘటుగా సమాధానాలు ఇచ్చింది.

Jyothika married Suriya a month after he proposed: I had all the money I  needed - Hindustan Times

అయినా వార్తలు ఆగ‌క‌పోవడంతో.. మరోసారి నోటితో ఏమి చెప్పకుండా.. అడ్డమైన ప్రకటనలు చేయకుండా.. ఒకే ఒక్క వీడియోతో అందరి నోర్లు టక్కును మూయించారు ఈ జంట. ఇటీవల ఓ రొమాంటిక్ టూర్‌కు వెళ్లారు ఈ కపుల్. సూర్య ఐదు పై దూల వయసుకు దగ్గర పడుతున్నా.. జ్యోతిక 45 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ వీరిద్దరు రొమాంటిక్ టూర్ ఎంజాయ్ చేశారు. మంచి ప్రదేశంలో వేడివేడి టైం లో స్పెండ్ చేస్తూ ఏకాంతంగా గడిపారు. ఈ జంట రొమాంటిక్ టూర్ కోసం ఫిన్లాండ్ వెళ్లినట్లు సమాచారం. తాజాగా మరోసారి జ్యోతిక సూర్యకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక‌ మాట్లాడుతూ సూర్యపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

Suriya and Jyotika watch Northern Lights in Finland - India Today

చాలా రోజుల నుంచి నా సినిమాల్లో నేను మెయిన్ లీడ్ చేస్తున్నా అంటూ వివరించిన ఆమె.. నా సినిమాల్లో వేరే హీరో కావాలని అనుకోవడం లేదు. మంచి కథ ఉంటే బాలీవుడ్ లో సూర్యతో కలిసి ఓ సినిమా నటించాలని ఉంది అంటూ ఆమె కోరికను వివరించింది. సూర్య గురించి ఆమె మాట్లాడుతూ ఆయన అందరిని గౌరవిస్తారు. అందరి కోసం టైం కేటాయిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది. సూర్య లో ఈ విషయం నాకు బాగా నచ్చుతుందని.. ఆయనకు సహనం ఎక్కువ అంటూ వివరించింది. స్నేహానికి ఎంతో విలువ ఇస్తాడంటూ జ్యోతిక చెప్పుకొచ్చింది.

Old Pics Of Surya's Foreign Vacation With Family Viral Again; Internet  Reacts - News18

ఆయన అవతలి వ్యక్తులు చెప్పే ప్రతి మాటను ఓపికగా వింటాడని.. ఇంట్లో నేను ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటా.. సూర్య అన్ని ఓపికగా వింటాడు అంటూ జ్యోతిక వివరించింది. సూర్య ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన తట్టుకుని గట్టిగా నిలపడగలరు అంటూ షేర్ చేసుకుంది. అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఆయనలో కూడా ఒక క్వాలిటీ అంటే ఆమెకు అసలు నచ్చదట. సూర్య బాత్రూంలో ఎక్కువ టైం గడిపేస్తాడు అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. ఈ విషయం సూర్యలో నాకు నచ్చదు అంటూ జ్యోతిక చేసిన ఫ‌నీ కామెంట్స్ నెటింట వైరల్ గా మారాయి.