పుష్ప 2 టీజర్‌తో న‌యా రికార్డ్ క్రియేట్ చేసిన బన్నీ.. పండ‌గ చేసుకుంటున్న ఫ్యాన్స్‌..?!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ గా దూసుకుపోతున్నాడు. కెరార్ ప‌రంగా ఆయ‌న‌కు లక్ కూడా బాగా వ‌ర్కౌట్ అవుతుంది. వరుస విజయాలను అందుకుంటు దూసుకుపోతున్న బన్నీ.. సోషల్ మీడియాలో కూడా మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. రోజురోజుకు ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరుగుతుంది. ఇక బన్నీ, సుకుమార్ కాంబోలో రిలీజ్ అయిన పుష్ప 2 నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బ‌న్ని ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే పుష్ప 2 టీజర్ ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసి నెటింట‌ వైరల్ గా మారింది. బన్నీ ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరింది.

Watch Pushpa 2 Teaser Ft Allu Arjun & Rashmika Mandanna At This Time Tomorrow, Check Out The New Captivating Poster!

ఇంతకీ ఆ రికార్డు ఏంటి అనుకుంటున్నారా.. టీజర్ ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగి రికార్డ్‌ సృష్టించింది. పుష్ప 2 టీజర్‌కి యూట్యూబ్లో ఏకంగా 110 మిలియన్ వ్యూస్, 1.55 మిలియన్ లైకులు రావడం విశేషం. ఏకంగా 138 గంటలు యూట్యూబ్లో నెంబర్ వన్ స్థానంలో ఓ టీజర్ ఉండడం అనేది సాధారణ విషయం కాదు అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రికార్డ్ బ్రేక్ కావాలంటే కూడా మళ్లీ చాలా టైం పడుతుందని.. ఎవరు ఇప్పట్లో ఈ రికార్డును టచ్ చేయలేరంటూ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవ‌లం టీజర్‌తో ఈ రేంజ్‌లో రికార్డ్‌ క్రియేట్ అయింది అంటే.. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ లతో బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవడం ఖాయం అంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Pushpa The Rule Teaser Review |Allu Arjun | Sukumar |Rashmika Mandanna|Fahadh Faasil|Movie Reaction - YouTube

విజువల్‌గాను సినిమా అదిరిపోయే లెవెల్ లో ఉండబోతుందని.. మన అంచనాలను మించిన రేంజ్ లో సినిమా ఉంటుందంటూ కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుంటూ పుష్పా ది రూల్‌ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాకు పోటీగా మరే మూవీ లేకపోవడం ఈయనకు మరింత కలిసొచ్చింది అని చెప్పవచ్చు. దీంతో ఈయన సినిమా కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక సినిమా ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్ లో ఉండ‌నున్నాయ‌ట‌. పుష్ప ది రూల్ రిలీజ్ కు సరిగా 120 రోజులు టైం మిగిలి ఉంది. దీంతో అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.