బాలీవుడ్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్.. ఏం జరిగిందంటే..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది దేవర సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర నుంచి నిరంతరాయంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంటూ.. కచ్చితంగా బాక్సాఫీస్ బ్లాక్ అవ్వడం పక్క అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. తారక్ ఇటీవల బాలీవుడ్ మూవీ వార్‌2 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్స్ లో సందడి చేసిన పిక్స్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ సినిమా త‌ర్వాత‌ తారక్ యశ్ రామ్ ఫిల్మ్స్‌ బ్యానర్ లో మరో బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Jr NTR looks surprised to see paparazzi as he arrives in Mumbai for War 2  shooting: 'Arey kaun, kaise aagaye yaar' | Bollywood - Hindustan Times

కరణ్ జోహార్ బ్యానర్ లో కూడా తారక్ హీరోగా సినిమాలో నటించనున్నాడట. కరణ్ జోహార్, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కాగా బాలీవుడ్ లో తారక వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో తారక్ ఫ్యాన్స్ ఓ పక్కన ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే.. మరో పక్క టాలీవుడ్‌కు ఎక్క‌డ దూరమవుతారు ఏమో అన్న ఆందోళన కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. క్రేజ్ పరంగా మరింత ఎదగాలంటూ కెరీర్‌లో మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Jr NTR 's War 2 look revealed as he lands in Mumbai for the film. Watch |  Bollywood News - The Indian Express

ఇప్పటికే నార్త్ ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. రోజు రోజుకు క్రేజ్ ను రెట్టింపు చేసుకుంటున్నారు. తాను న‌టించే ప్రతి సినిమా వైవిద్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న తారక్ ప్రస్తుతం నటిస్తున్న వార్ 2 సినిమాలో ఏ రోల్‌లో న‌టిస్తున్నాడో తెలుసుకోవాల‌ర‌నే ఆశ‌క్తి ప్రేక్ష‌కుల‌లో నెల‌కొంది. తన రోల్ కు సంబంధించిన క్లారిటీ తార‌క్ ఇస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో రెమ్యూనరేషన్ విషయంలో ఎన్టీఆర్ సరికొత రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని కామెంట్లు చేస్తున్నారు.