‘ ఎన్‌బికె 109 ‘ మూవీ హక్కుల కోసం పోటీ పడుతున్న డిస్ట్రిబ్యూటర్స్.. బాలయ్య రేంజ్ అది..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాలయ్య. ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ యంగ్ హీరోలకు దీటుగా వెళుతున్న బాలయ్య.. చివరిగా నటించిన మూడు సినిమాలు హ్యాట్రిక్ విజ‌యాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 108 సినిమాలు పూర్తి చేసిన బాలయ్య.. ప్రస్తుతం తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కొల్లి బాబి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి కొంతకాలం క్రితం రిలీజ్ అయిన గ్లింప్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ ప్రేక్ష‌కులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

NBK 109 Glimpse: Balayya In Savage Action Mode

ఇలాంటి క్రమంలో సినిమా డిస్ట్రిబ్యూటర్స్ రైట్స్ తీసుకోవడానికి ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బడా డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా హక్కుల కోసం తెగ పోటీ పడుతున్నారట. ప్రొడ్యూసర్ ఎంత అడిగినా అంత ఇవ్వడానికి వీరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఈ సినిమాను వదులుకోవడానికి మాత్రం ఎవరు ఇష్టపడడం లేదట. అందుకే ఈ సినిమా కోసం భారీ మొత్తంలో డబ్బులు కేటాయించి డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ముందుకు వెళ్లడమే లక్ష్యంగా మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఓ సీనియర్ హీరో సినిమాకు ఏ రేంజ్ లో పోటీ ఉంటుందంటే.. ఆయన సినిమాలు ప్రేక్షకలో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తున్నాయో తెలుసుకోవచ్చు.

Balakrishna | Zee News Telugu

ఇక బాబికి ఉన్న మార్కెట్ రిత్యా కూడా సినిమాపై ప్రేక్షకుల మంచి అంచనాలే ఉన్నాయి. కనుక ఈ సినిమా ఈజీగా ఓపెనింగ్స్ కానీ.. కలెక్షన్స్ కానీ.. మంచి వసూళ్లను సాధిస్తుందనే ఉద్దేశంతోనే.. ఈ సినిమాకు ఎంత ఖర్చు పెటైనా తీసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్ సిద్ధంగా ఉంటున్నారు. ఇక ఈసారి బాలయ్య ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే వరుస హ్యాట్రిక్లతో ఉన్న బాలయ్య నాలుగో సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసేందుకు కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు మూవీ టీం.