100 కోట్ల టిల్లు స్క్వేర్.. ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?!

స్టార్ హీరో సిద్దు జొన్నలగడ్డ, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మూవీ టిల్లూ స్క్వేర్. సుమారు రెండేళ్ళ‌ క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. యంగ్‌ డైరెక్టర్ మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి (రాధిక) కూడా క్యామియో రోల్ లో కనిపించింది. 29న థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టి రికార్డ్స్ సృష్టించింది.

టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులంతా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై ఓ క్రేజి న్యూస్ వైరల్ గా మారింది. టిల్లు స్క్వేర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట ఏప్రిల్ నెలకరులో ఈ సినిమా రిలీజ్ అవుతుందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం థియేటర్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో స్ట్రీమింగ్ మరింత ఆలస్యం అవ్వనుందట‌.

ఇక నిన్న మొన్నటి వరకు ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా థియేటర్లలో దూసుకుపోయిన టిల్లు స్క్వేర్.. యూఎస్ షోలతో మ‌హేష్ గుంటూరు కారం సినిమా రికార్డ్‌లను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా అక్కడ రన్ అవుతూనే ఉంది. కాగా ఈ ఏడాది రిలీజై బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ సాధించిన సినిమాల్లో టాప్ 2 స్థానాని టిల్లు స్క్వేర్ ద‌క్కించుకుంది. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్‌కు మరి కొంత అల‌స్యం కానుంద‌ట‌. మే 3వ వారంలో ఈ టిల్లు స్క్వేర్ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.