ప్రభాస్ కి ఆ ముగ్గురు అంత స్పెషలా..? స్పీడ్ డైల్ లో వాళ్ల నెంబర్స్ నే ఉంటాయా..?

ప్రభాస్.. ఈ పేరు చెప్తే తెలియకుండానే వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఆరడుగుల కటౌట్ ఉన్న ప్రభాస్ ఫిజిక్ చూస్తే ఎవరికైనా సరే టెంప్టింగ్ ఫీలింగ్ కలుగుతుంది . పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఒక్కొక్క సినిమాకి 100 నుంచి 150 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్న ప్రభాస్ ప్రెసెంట్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . నాగశ్విన్ దర్శకత్వంలో అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు . ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది.

దిశాపటాని మరొక హీరోయిన్గా నటిస్తుంది . రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ కి సంబంధించిన ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ ఉంటుంది. ప్రభాస్ స్పీడ్ డైల్ లిస్టులో ఉన్న ఆ ముగ్గురి పేర్లు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ స్పీడ్ డైల్ లిస్టులో ఉన్న ఆ ముగ్గురు మరెవరో కాదు ప్రభాస్ అమ్మగారు.. ప్రభాస్ పెద్దమ్మ ..ప్రభాస్ బ్రదర్.. వీళ్ళ ముగ్గురు నెంబర్లు ఎప్పుడు ప్రభాస్ ఫోన్ స్పీడ్ డైల్ లిస్టులో ఉంటాయట . అంతేకాదు ప్రభాస్ మొబైల్ ని ఎక్కువగా వాడట . అవసరానికి తగ్గట్టే వాడుతూ ఉంటాడట . ఆ మాటకొస్తే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏది కూడా ప్రభాస్ ఎక్కువగా వాడట. ప్రభాస్ కి సంబంధించిన ఈ న్యూస్ ని రెబెల్ ఫాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ మంచి మనిషి అని ప్రభాస్ పెద్దవాళ్ళకి కి ఎక్కువ గౌరవం ఇస్తాడు అని ..అందుకే ఆయన ఈ స్థాయికి ఎదిగాడు అని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!