కత్తిలాంటి ఫిగర్ ఉన్న శ్రీముఖీ కి ఆ లోపం ఉందా..? అందుకే పెళ్లికి దూరంగా ఉందా..?

శ్రీముఖి .. ఇండస్ట్రీలో ఓ టాప్ యాంకర్ . చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలో పెద్ద స్థానాన్ని దక్కించుకుంది . శ్రీముఖిని పలువురు లౌడ్ స్పీకర్ అని రాములమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ లెవెల్స్ హై గా పెరిగిపోతూ ఉంటాయి. చాలామంది స్టార్ హీరోలు సైతం శ్రీముఖి హోస్టింగ్ ని మెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా నేటి యువత ఇష్టపడే పంచులతో కొన్ని కొన్ని నాటి పదాలతో శ్రీముఖి యాంకరింగ్ వేరే లెవెల్ లో చేస్తూ ఉంటుంది .

అంతేకాదు స్టార్ హీరోయిన్స్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. కత్తిలాంటి ఫిగర్ ఉంది శ్రీముఖికి అంటూ పలువురు జనాలు పొగిడేస్తూ ఉంటారు. అలాంటి శ్రీ ముఖీ పెళ్లి వయసు వచ్చిన ఇంకా పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించట్లేదు ..ఏంటి..? అన్న ప్రశ్న ప్రతి ఒక్క శ్రీముఖి అభిమానికి వస్తూనే ఉంటుంది . అయితే తాజాగా ఓ షోలో దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చేసింది శ్రీముఖి .

ఆమె పెళ్లి లేట్ అవ్వడం కారణంగా ఆమెకు ఏదో లోపం ఉంది అని ప్రచారం జరిగింది . తాజాగా ఓ షో లో పాల్గొన్న శ్రీముఖి మాటల సందర్భంలో తాను ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తనలో ఏదో లోపం ఉంది అని అందరూ అనుకుంటున్నారు అని ..అలాంటిది ఏదీ లేదు అని.. నేనే కావాలని పెళ్లికి దూరంగా ఉన్నాను అని క్లారిటీ ఇచ్చింది . ఈ మాటతో శ్రీముఖి ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నా.. అయితే ఎందుకు శ్రీముఖి పెళ్లికి దూరంగా ఉంది ..? అన్నది మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు . శ్రీముఖి కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది..!!