ఈ పై ఫోటోలో నోరెళ్ళబెట్టి చూస్తున్న టాలీవుడ్ హాట్ బ్యూటీని గుర్తుపట్టారా.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

ఈ ఫోటోలో నోరెళ్లబెట్టి అమాయకంగా చూస్తున్న చిన్నది ప్రస్తుతం టాలీవుడ్ హాట్ బ్యూటీ. హీరోయిన్స్ కు మించిన క్రేజ్ సొంతంచేసుకుని గ్లామర్‌తో యూత్‌ను ఆక‌ట్టుకున్నే ఈ అమ్మడు.. ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా భారీ క్రేజ్‌తో దూసుకుపోయింది. నటిగా మారిన తర్వాత వెండితెరపై వరుస‌ సక్సెస్‌లు అందుకుంటూ సినిమా ఆఫర్లతో బిజీ అయిపోయింది. అయితే ఈ అమ్మడు ఫైర్ బ్రాండ్ కూడా. ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకొని పలు ట్రోల్స్ కు గురవుతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఎలాంటి ట్రోల్స్ జరిగినా ఎంతమంది టార్గెట్ చేసిన అసలు తగ్గదు. కొందరు యాటిట్యూడ్ అని విమర్శించిన అది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని రిప్లై ఇస్తుంది.

Anasuya Bharadwaj Looking Cute in Black Saree | Telugu Rajyam Photos

ట్రోల‌ర్స్‌ను రెచ్చగొట్టేలా పోస్ట్లు షేర్ చేస్తూ ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్టు బతకాలనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. ఇప్పటికైనా ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టి ఉంటారు. ఆమె ఎవరో కాదు అనసూయ భరధ్వాజ్. జబర్దస్త్ వేదికగా అనసూయ సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ తో పాటు గ్లామర్‌ను యాడ్ చేసిన మొట్టమొదటి ఫిమేల్ యాంకర్ అనసూయ అన్న సంగతి తెలిసిందే. అనసూయ కంటే ముందు తెలుగు యాంకర్స్ ఎవరు గ్లామర్ షో చేసిన దాఖలాలే ఉండవు. ఆ రూల్ బ్రేక్ చేస్తూ అనసూయ గ్లామర్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంది. అనసూయ డ్రెస్సింగ్ ఎన్నో సార్లు వివాదాన్ని సృష్టించింది.

Anasuya Bharadwaj: Actress Anasuya Bharadwaj to play prostitute in her..

అయినప్పటికీ నా బట్టలు నా ఇష్టం. నాకు కంఫర్ట్ గా అనిపిస్తే ఎలాంటి బట్టలైనా ధరిస్తా అంటూ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ విమర్శకుల నోళ్ళు మూయించేది. దాదాపు తొమ్మిదేళ్లు జబర్దస్త్ లో స్టార్ యాంకర్ గా దూసుకుపోయిన అనసూయ.. 2022లో ఆషోకు గుడ్ బై చెప్పి.. పూర్తిగా ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ మంచి పాపులారిటీ దక్కించుకుంటుంది. గతేడాది రంగమ్మార్తండా, విమానం, ప్రేమ విమానం, మైకేల్, పెదకాపూ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. పుష్ప 2లో దాక్షాయినిగా మరోసారి మెప్పించేందుకు సిద్ధమవుతుంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు అనసూయ చేతిలో మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా గడుపుతుంది.