జగపతిబాబు ఇంట్లో దొంగత‌నం.. ఆ టైంలో ఆయన చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

సినీ ఇండస్ట్రీలో నటిన‌టులుగా సక్సెస్ సాధించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఆ క్రేజ్ నిలబెట్టుకోవాలన్న అదే రేంజ్ లో వారు శ్రమిస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీలు అనగానే టక్కున గుర్తుకు వచ్చేది వారి లగ్జరీ లైఫ్. వీరు కేవలం భారీ రేమ్యునరేష‌న్‌ కొల్లగొట్టి స్టార్లుగా లగ్జరీ లైఫ్ ని అనుభవించడమే కాదు.. చాలామంది సేవ కార్యక్రమాలను చేస్తూ రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్ లోను హీరోలుగా పాపులారిటీ దక్కించుకుంటూ ఉంటారు. ఇలా పవన్ కళ్యాణ్ అడిగిన వారికి కాదనకుండా సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. మహేష్ బాబు ఇప్పటికే తన సొంత ఊరిలో దత్తత తీసుకోవడమే కాకుండా.. ఎంతోమంది అనాధలకు, నిరుపేదలకు హాట్ ఆపరేషన్లు, చదువులు చెప్పించ‌టం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఇక చిరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించే వ్యక్తిగా చిరంజీవిని భావిస్తారు. అయితే గతంలో స్టార్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోయిన జగపతిబాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు నటిస్తూ రాణిస్తున్నాడు. అయితే ఈయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ బయటకు చెప్పుకోరు. అయినా ఆయన నుంచి సాయం పొందిన వారు ఆయన పట్ల ఎప్పటికీ కృతజ్ఞతలు చూపిస్తూనే ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా దీనికి సంబంధించిన ఓ సంఘటన నెట్టింట వైరల్ గా మారింది. గతంలో జగపతిబాబు ఇంట్లో కొంతమందికి దొంగలు పడ్డారట. జగపతిబాబు వారిని గుర్తించి పోలీసులకు పట్టించారట.

ఇక జైల్లో ఉన్న ఆ దొంగల భార్యలు జగపతిబాబు ఫోన్ నెంబర్ కనుక్కొని మరి ఆయనకు కాల్ చేసి రిక్వెస్ట్ చేశారట. మా భర్తలు జైల్లో ఉండడం వల్ల మా జీవితాలు ఘోరంగా త‌యార‌య్యాయ‌ని.. పిల్లా, పాపలతో మేము రోడ్డుపైకి వచ్చేసాం అంటూ ఎమోషనల్ అయ్యారట. వాటికి కరిగిపోయిన జగపతిబాబు.. ఆ దొంగల కుటుంబాలకు డబ్బు రూపంలో కొంత సహాయం చేశాడట. ఒకసారి మాత్రమే డబ్బు ఇచ్చి చేతులు దులిపేయకుండా.. ఆ దొంగలు జైలు నుంచి రిలీజ్ అయ్యేంతవరకు ప్రతి నెల కొంత డబ్బును వారి కుటుంబాలకు ఇచ్చాడట. ఈ విషయం జగపతి బాబు స్వయంగా వివరించాడు. ప్రస్తుతం ఈ న్యూ స్‌ వైరల్ అవ‌డంతో అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు. దొంగతనం చేసిన వారి కుటుంబాలపై కూడా జాలి చూపించారు అంటే మీరు ఎంత గ్రేట్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.