‘ రాజాసాబ్ ‘ సినిమాపై గుడ్ న్యూస్ షేర్ చేసిన తేజసజ్జా..పండగ చేసుకుంటున్న డార్లింగ్ ఫ్యాన్స్..?!

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో నటిస్తున్న కల్కి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ రాజా సాబ్. ఈ మూవీ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. మరొక సైలెంట్‌గా రాజాసాబ్ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసేస్తున్నాడు. ఇంత నిశబ్దంగా షూటింగ్ జరుగుతున్న సినిమాకు సంబంధించి ఎప్పుడూ ఏదో న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతూనే ఉంది.

Prabhas' The Raja Saab Movie Gallery, HD Stills

ఈ క్రమంలో తాజాగా బేబీ మూవీ ప్రొడ్యూసర్ చేసినటువంటి కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. మ్యూజిక్ సింబల్ పెట్టి ఎస్ కే ఎన్ ఒక ట్విట్ షేర్ చేయగా.. దానికి మారుతీ స్పందిస్తూ స్మైలీ సింబల్ ను షేర్ చేశాడు. దీంతో రాజా సాబ్ నుంచి త్వరలోనే ఓ సాంగ్ రాబోతుందంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. తాజాగా ప్రభాస్ అభిమానులకు శుభవార్త చెప్పాడు యంగ్‌ హీరో తేజ సజ్జ. ప్రస్తుతం తేజ సజ్జా నటిస్తున్న మీరాయ్‌ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌ రిలీజ్ వేడుక రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది.

Super Hero Teja Sajja Speech At Mirai Movie Glimpse Launch Event LIVE in  VenkyDigitalEntertainment - YouTube

ఈ వేడుకకు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ హాజరై సందడి చేశాడు. ఈ ఈవెంట్లో ప్రొడ్యూసర్ కు రాజా సాబ్ మూవీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురు కావడంతో ఆయన స్పందిస్తూ కల్కి మూవీ రిలీజ్ తర్వాత రాజాసాబ్‌ నుంచి అప్డేట్స్ వస్తాయంటూ చెప్పుకొచ్చాడు. అదే టైంలో తేజ మాట్లాడుతూ త్వరలో రాజా సాబ్ వచ్చేస్తుందని.. డౌట్ గా ఉందండి అంటూ కామెంట్ చేశాడు. తేజ మాటలకు చిరునవ్వుతో రిప్లై ఇచ్చాడు ప్రొడ్యూసర్. దీంతో త్వరలోనే రాజాసాబ్‌ సాంగ్ రాబోతుందనే విషయంపై ప్రొడ్యూసర్ పూర్తిగా క్లారిటీ ఇచ్చేసాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.