బిగ్ షాకింగ్: ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్న స్టార్ హీరోయిన్… కారణం ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం ..మాయాలోకం ..ఎప్పుడు ఏమైనా జరగొచ్చు ..ఎవరి తలరాత ఎప్పుడు మారిపోతుందో ఎవ్వరం కూడా చెప్పలేము. అలాంటి సందర్భాలు ఎన్నో చూసాం . అయితే రీసెంట్గా ఓ హీరోయిన్ ఊహించిన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఆమె చరణ్ – తారక్ – అల్లు అర్జున్ – మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలో నటించింది .

వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లు అందుకుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి తనదైన స్టైల్ లో యాక్టింగ్ తో శభాష్ అనిపించుకుంది. రీసెంట్ గానే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది . సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమె ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలి అంటూ డిసైడ్ అయ్యిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఆమె మరి ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేసింది . పెళ్లి తర్వాత వెంటనే సినిమాలపై కాకుండా ఇలా బిజినెస్పై ఇంట్రెస్ట్ చూపించడంతో జనాలకు కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయి . అంతేకాదు ఇన్సైడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుంది అని అందుకే బిజినెస్ వైపు అడుగులు వేస్తుంది అని సమాచారం అందుతుంది . దీంతో ఫాన్స్ షాక్ అయిపోతున్నారు. పెళ్లి తర్వాత ఎలాంటి రోల్స్ వస్తాయో రకుల్ కి తెలుసు.. అందుకే ఆమె ఇండస్ట్రీ నుంచి తప్పకుంటుందట..!