ప్రభాస్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ చిన్న పనితో సలార్ బైక్స్ మీ సొంతం.. ఏం చేయాలంటే..?!

పాన్‌ ఇండియన్ స్టార్ ప్రభాస్ చివరిగా నటించిన సలార్ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు రూ.700 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీలో ప్రభాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ‌తేడాది చివ‌రిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో, డిజిటల్ మీడియాలోనూ రికార్డులు బ్రేక్ చేసింది. అయితే త్వరలోనే ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.

Salaar' worldwide box office collection: Prabhas' film crosses Rs 550 crore  in 8 days - BusinessToday

ఈనెల 21న సినిమా స్టార్ మా లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్‌లోనూ, డిజిటల్ మీడియాలోను సక్సెస్ అందుకున్న సలార్ బుల్లితెరపై కూడా అంతకుమించిన హిట్ అందుకోవాలని ఉద్దేశంతో మేకర్స్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కేవలం వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి.. సినిమాలో ప్రభాస్ నడిపిన ఐకానిక్ బైక్ ను గెలుచుకునే అవకాశం పొందండి అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Prabhas' Salaar effect: Book My Show crashes | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ఈ ఆదివారం స్టార్ మా లో స్ట్రీమింగ్ కానున్న సలార్ సినిమా చూస్తూ.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబితే.. ఆ బైక్ గెలిచే అవకాశం మీ సొంతం అంటూ చివరిలో టర్మ్స్‌ అండ్ కండిషన్స్ అప్లై అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు. అయితే ఈ ప్రభావం సినిమా టిఆర్పి రేటింగ్ పై భారీ ప్రభావం చూప‌నుంది. ఇలా మొదటి భాగంతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సలార్‌.. రెండో భాగంతో త్వరలోనే సెట్స్ పైకి రానుంది.