కోట్లు విలువ చేసే కారుని తారక్ కి గిఫ్ట్ చేసింది ఎవరో తెలుసా..? మోస్ట్ స్పెషల్ పర్సన్..!!

మనందరికీ బాగా తెలుసు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటి సంపాదించుకున్న తారక్ కి కార్లు అంటే కూసింత ఇంట్రెస్ట్ ఎక్కువే . తన గ్యారేజ్ లో ఇప్పటికే డిఫరెంట్ డిఫరెంట్ కార్లు ఉన్నప్పటికీ కొత్త కారును కొనుగోలు చేస్తూ ఉంటారు. తాజాగా తారక్ గ్యారేజీలోకి కొత్త కారు వచ్చి చేరింది .దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఎన్టీఆర్ ఖైరతాబాద్ లోని ఆర్టీవో ఆఫీస్ లో మెరిశారు. బ్లాక్ టీ షర్ట్ .. బ్లూ జీన్స్ ప్యాంట్ బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి చాలా చాలా స్టైలిష్ గా చాలా సింపుల్ లుక్స్ లో అభిమానులను ఆకట్టుకున్నాడు. సడన్గా ఎన్టీఆర్ ఖైరతాబాద్ లోని ఆర్టీవో ఆఫీస్ లో ఎందుకు మెరిసారా..? అని జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు . అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారును కొనుగోలు చేశారు.

అయితే ఈ కారు ఖరీదు దాదాపు మూడు కోట్లకు పైగానే ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ ఈ కారుని ఎప్పటినుంచో ఇష్టపడుతున్నారట . కొనుక్కోవాలి అంటూ ఆశపడుతున్నారట . ఈ విషయం తెలుసుకున్న తన తల్లి శాలిని ఎన్టీఆర్ కి సర్ప్రైజ్ గా ఈ కారును గిఫ్ట్ చేసిందట . ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ ఎన్టీఆర్ దేవరా అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు..!!