బాక్స్ ఆఫిస్ వద్ద టిల్లుగాడి ఊచకోత.. పాన్ ఇండియా రికార్డ్స్ తుక్కు తుక్కు..5 డేస్ లో మొత్తం ఎన్ని కోట్లు అంటే..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టిల్లు గాడి పేరు మారుమ్రోగిపోతుంది . గతంలో డీజే ట్ల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా 29న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది . సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా రామ్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . నాగ వంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ఈ సినిమా అభిమానులకు బాగా ఎక్కేసింది.

మరీ ముఖ్యంగా సిద్దు గాడి వే ఆఫ్ టాకింగ్ ..వే ఆఫ్ బిహేవియర్ ..వే ఆఫ్ స్టైల్ కుర్రాళ్లకు బాగా బాగా ఎక్కేసింది . ఈ సినిమాలోని డైలాగ్స్ ఎలా ట్రెండ్ చేస్తున్నారో చూస్తుంటే ఈ సినిమా వాళ్లకి ఎంత నచ్చింది అనే విషయం అర్థం చేసుకోవచ్చు . కాగా ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు కూడా పెద్దగా ఆడడం లేదు . ఒకటి రెండు రోజులకే బాక్స్ ఆఫీస్ వద్ద షట్టర్స్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటిది ఒక చిన్న హీరో సినిమా బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొడుతుంది అంటే కారణం మాత్రం ఆ సినిమాలోని కంటెంట్ .

రీసెంట్గా ఈ సినిమా 5 డేస్ కలెక్షన్స్ బయటపడ్డాయి . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 85 కోట్లు క్రాస్ చేసి సంచలన రికార్డు నెలకొల్పింది. అంతేకాదు మరో రెండు రోజుల్లోనే ఇది 100 కోట్లు క్రాస్ చేసే దిశగా దూసుకుపోతుంది అంటూ చిత్ర బృందం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ సినిమాకి హైలెట్ పెర్ఫార్మన్స్ సిద్దు జొన్నలగడ్డ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా హీరోలు సాధించలేని రికార్డ్స్ కూడా సిద్ధూ జొన్నలగడ్డ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసేస్తున్నాడు. దీంతో ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . త్వరలోనే ఈ సినిమా 100 కోట్లు కూడా క్రాస్ చేసేస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!