అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయినా శివన్న.. అంధోళ‌న‌లో ఫ్యాన్స్‌.. ఏం జరిగిందంటే..?!

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌కు టాలీవుడ్‌లోను ప్రత్యేక ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు. దివంగత నటుడు పుణీత్ రాజకుమార్ సోదరుడుగా శివన్న అందరికీ పరిచయమే. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న శివన్న.. తాజాగా అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తుంది. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో శివన్న చేరార‌ని టాక్‌. అయితే ఆయన హాస్పటల్లో చేరడానికి గల అస‌లు కారణం ఏంటో ఇప్పటివరకు తెలియ రాలేదు. ఈ క్ర‌మంలో శివ‌న్న‌ను చూసేందుకు మధు బంగారప్ప హాస్పిటల్ కి వెళ్లారు.

Puneeth Rajkumar's elder brother Shivarajkumar says he's still in denial -  India Today

దీంతో శివ రాజ్‌కుమార్‌ ఆరోగ్యం పై అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. కాగా డాక్టర్ తెలిపిన సమాచారం ప్రకారం శివరాజ్ కుమార్ కు ఎలాంటి తీవ్ర అనారోగ్యం లేదట. కేవలం జనరల్ చెకప్ కోసమే ఆయన హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా శివరాజ్ కుమార్ వరుస ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఓవైపు సినిమా పనులు.. మరోవైపు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు.

Shivarajkumar and wife seek Rajkumar's blessing in Bangalore | Events Movie  News - Times of India

ఆయన భార్య గీత ఈసారి షిమోగా లోక్‌శ‌భ‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన భార్య తరపున ప్రచారం చేసేందుకు పలు ప్రదేశాల్లో పర్యటిస్తూ సందడి చేస్తున్నాడు. అయితే ఇప్పటికే పుణీత్‌ రాజకుమార్‌ను కోల్పోయిన బాధలో అభిమానులు ఉండగా.. అన్నయ్య శివరాజ్ కుమార్ కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తెలియడంతో.. అంతా ఆందోళన చెందుతున్నారు. ఆయనకు కూడా ఏదైనా జరిగితే తట్టుకోలేమంటూ కామెంట్లు పెడుతున్నారు.