పవర్ స్టార్ లాంటి స్టార్ కు పదేళ్లు హిట్ లేకపోయినా పోయేదేం లేదు.. దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజుకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వరుస‌ సినిమాలను నిర్మిస్తూ.. ఆడియన్స్ లో ఎప్పటికప్పుడు ఆసక్తి నెల‌కొల్పుతున్న దిల్ రాజు.. ప్రస్తుతం తన బ్యానర్ నుంచి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రమోషన్స్ లో పాల్గొని వరుస ఇంటర్వ్యూల సందడి చేస్తున్నాడు దిల్ రాజు.

Dil Raju eyeing on the 'Devara' release date for 'Family Star'

తాజాగా ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయిన హీరోలపై ఎటువంటి ప్రభావం పడదని.. నిర్మాతలపైనే ఆ ఎఫెక్ట్ ఉంటుందని వివరించాడు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో కెరీర్‌లో పదేళ్లపాటు హీట్ రాలేదు. అయినా ఆయనకు పోయేదేమీ లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అదే నిర్మాతలకు మాత్రం సినిమా పోతే చాలా నష్టం కలుగుతుందని.. మూవీకి వచ్చే రిజల్ట్ పైనే ఆ ప్రొడ్యూసర్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు.

In Talk: Dil Raju's Political Dreams!

అయితే ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారడంతో.. కొందరు దిల్ రాజు చెప్పింది కూడా నిజ‌మేక‌దా అంటూ సపోర్ట్‌గా మాట్లాడుతుంటే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం మా స్టార్ హీరోకు పదేళ్లుగా హిట్ లేదని చెప్పేందుకు నువ్వు ఎవరు.. నీకు ఆయన వల్ల ఎలాంటి నష్టం క‌లిగింది.. ఉద‌హ‌ర‌ణ‌గా చెప్పేందుకు ఇంక ఎవ‌రు దొర‌క‌లేదా అంటూ ఫైర్ అవుతున్నారు.