‘ విశ్వంభర ‘ కోసం పోరుకు సిద్ధమైన చిరూ.. సినిమాలో టర్నింగ్ పాయింట్ అదేనా..?!

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమా విశ్వంభర షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వ‌శిష్ట మ‌ల్లిడి డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా సోషియ ఫాంటసీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవితో పాటు ఫైటర్స్ తో కూడిన యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలపై షూట్ జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Chiranjeevi unveils release date of 'Vishwambhara', shares new poster –  ThePrint – ANIFeed

ఫైట్ మాస్టర్ ఇద్దరు రామ్ – లక్ష్మణ్ పర్యవేక్షణలో ఈ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందుతున్నాయట. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం. ఎం. కీరవాణి సినిమాకు సంగీతం అందిస్తుండగా.. శ్రీ శివశక్తి దత్త, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు.

Vishwambhara: Megastar Chiranjeevi plays the role of a 70 year old man

2025 జనవరి 10న ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ పోతు సనివేశాలు సినిమాకు హైలెట్గా నిలవనున్నాయని టాక్. ఇక చిరంజీవి నుంచి చాలా రోజులకు సోషల్ ఫాంటసీ డ్రామా తెరకెక్కడం.. అది కూడా జగదేకవీరుడు అతిలోకసుందరి స్టైల్ లో ఉంటుందని టాక్ రావడంతో.. ప్రేక్షకుల్లో సినిమాపై మరింత హైప్ పెరిగింది.