తమ్ముళ్లను ఎంతో ప్రేమగా చూసుకొని చిరంజీవి ఆ విషయంలో మాత్రం నాగబాబును చితకబాదాడా.. ఏం జరిగిందంటే.. ?!

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవికి కోపం రివ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంది. ఎవరైనా తప్పు చేసినా చిరంజీవి సున్నితంగా హెచ్చరిస్తారని ఇండస్ట్రీవ‌ర్గాల టాక్‌. 46 సంవత్సరాల సినీ కెరీర్‌లో చిరంజీవి ఎంతోమందికి అద‌ర్శంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి ఎవరినైనా కొట్టానని స్వ‌యంగా చెప్పినా ఎవరూ నమ్మరు. అయితే తాజాగా ఓ సందర్భంలో చిరంజీవి తాను నాగబాబును కొట్టానని చిరు వివ‌రించాడు ఈ న్యూస్ ప్ర‌స్తుతం వైరల్‌గా మారింది. చిరు త‌న త‌మ్ముళ్ళ‌ను ఇప్ప‌టికి ఎంతో ప్రేమ‌గా చూసూకుంటూ ఉంటారు. అలాంటి ఆయ‌న స్వ‌యంగా త‌న త‌మ్ముడిని ఓ విష‌యంలో చిత‌క‌బాదాడ‌ట‌.

Pawan Kalyan,Naga Babu wish Chiranjeevi | cinejosh.com

చిరు ఇంటర్ చదువుకునే రోజుల్లో నాగబాబు ఏడో తరగతి చదువుతున్నాడని.. ఆ సమయంలో అమ్మకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను సహాయం చేసేవాడినని ఆయ‌న వివ‌రించాడు. ఇంటికి సంబంధించిన పనులన్నీ నేనే చూసుకునేవాడినని.. ఒకరోజు లాండ్రీ నుంచి బట్టలు తీసుకొచ్చే పనితో పాటు మరో పని చేయాల్స్ ఉండ‌టంతో నేను ఆ ఇంకో పని చేసుకొని వస్తా.. నువ్వు లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకొనిరా నాగబాబుకు చెప్పానని.. మెగాస్టార్ చెప్పుకొచ్చాడు. నేను చేయాల్సిన పనిని పూర్తి చేసుకుని వ‌చ్చాన‌ని.. బట్టలు తెచ్చావా అని నాగబాబును అడిగితే తీసుకొనిరాలేదు నిద్రపోతున్నా అని చెప్పాడని చిరంజీవి వివ‌రించాడు.

Megastar Chiranjeevi's special wishes for Naga Babu on his 59th birthday | Telugu Movie News - Times of India

ఆ టైంలో నాగబాబు అలా చెప్పడంతో విపరీతమైన కోపం వచ్చి చిత‌క‌బాదాన‌ని చిరు వివ‌రించాడు. నాగబాబును నేను కొట్టడంతో.. చిన్నోడిని కొడతావా అంటూ అమ్మ నాకు చివాట్లు పెట్ఇంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చాడు. నాన్న వచ్చిన తర్వాత ఏడుస్తూ మొత్తం చెప్పాన‌ని నాన్న నాగబాబును మందలించార‌ని.. అప్పుడు నాకు రిలీఫ్ గా అనిపించిందని చిరంజీవి అన్నారు. మెగాస్టార్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. చూడడానికి ఎంతో కూల్ గా ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉన్న చిరంజీవి గారు చిన్న వయసులో అంత కోపంగా ఉండేవారా.. అంత చిన్న విషయానికే నాగబాబును చితక్కొట్టారా.. అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.