సూపర్ స్టార్ అసలు రూపం ఇదే.. రజినీ పై ఫైర్ అవుతున్న నెటిజన్స్.. కారణం ఇదే..

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ సూపర్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇటీవల లాల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన‌ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రజనీకాంత్ వెట్రిమాన్ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో రితిక సింగ్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా గుజరాత్, జామ్‌నగర్లో అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ – రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగిన‌ సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో తన ఫ్యామిలీతో కలిసి సందడి చేశాడు రజినీకాంత్.

Rajinikanth Reaches With Family In Jamnagar To Attend Anant Ambani-Radhika Merchant's Wedding (Video) | MENAFN.COM

తన భార్య, కూతురు ఐశ్వర్యలతో కలిసి ఈవెంట్ కు హాజరయ్యాడు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ వేడుకలు ఆదివారం ముగిసాయి. కాగా వేడుకలకు వెళ్తున్న రజనీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. అదే సమయంలో వారి దగ్గర పని చేసే ఓ మహిళ ప్రేమ్‌లోకి రావడంతో ఫోటోకు ఇబ్బంది కలగకూడదని.. ఆమెను రజినీకాంత్ పక్కకు వెళ్ళు అనేలా తన చేతులతో సైగ చేసి చూపించాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్స్ రజనీపై ఫైర్ అవుతున్నారు. సూపర్ స్టార్ అసలు రూపం ఇదే.. పైకి మంచి వాడిలా ముసుగు వేసుకుని తిరుగుతున్నాడు అంటూ.. కండక్టర్ స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన ఆయనకు కూడా పేద ప్రజలను గౌరవించడం రాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Akon, Amitabh Bachchan, Rajinikanth at Anant Ambani-Radhika pre-wedding bash - The Hindu

మరి కొందరు మాత్రం ఫోటో ఫ్రేమ్ కు అడ్డం వస్తే ఫోటోలు తీసే వారికి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఆయన కాస్త వెనక్కి జరగమని చెప్పారు.. అందులో తప్పేముంది. దాన్ని ఇంత నెగటివ్ చేయాల్సిన అవసరం ఏముంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రజనీకాంత్ ఇప్పటికై ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆసుపత్రి నిర్మాణానికి కూడా రజనీకాంత్ సిద్ధమయ్యారు. అయితే ఎన్నో మంచి పనులు చేసిన ఇంతగా హైలెట్ చేయరు కానీ.. ఏదైనా చిన్న త‌ప్పు కనిపిస్తే మాత్రం నెగటివ్ చేయడానికి ముందు ఉంటారు అంటూ రజనీకాంత్ ఫ్యాన్స్ వారిపై ఫైర్ అవుతున్నారు.