బిగ్ బ్రేకింగ్.. భర్త విగ్నేష్ ను అన్ ఫాలో చేసి అలాంటి స్టేటస్ పెట్టిన నయన్.. షాక్ లో ఫ్యాన్స్..

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్, కోలీవుడ్‌లో అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దాలు అవుతున్న రోజురోజుకు క్రేజ్ ను రెట్టింపు చేసుకుంటూ దూసుకుపోతుంది. సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ ఈమె కావడం విశేషం. తమిళ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ బ్యూటీ సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఇటీవల ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన నయన్.. వారి పిల్లలను చూపిస్తూ మొదటి పోస్ట్ షేర్ చేసింది. దానికి లక్షలో లైకులు, కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నయనతారకు ఇన్‌స్టాలో రూ. 78 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా.. ఇటీవల ఒక పోస్ట్ షేర్ చేసి వెంటనే డిలీట్ చేసింది. అయితే దీంతో పాటే భర్త విజ్ఞేష్ శివన్నీ కూడా అన్‌ఫాలో చేయడంతో ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. దీనిపై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సాంకేతిక లోపం వల్ల విగ్నేష్ పేరు కనిపించడం లేదంటూ.. వీళ్లు కూడా విడిపోతున్నారా ఏంటి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది సినీ సెలబ్రిటీస్ జంటలు ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్న తర్వాత విరాకులు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో నయన్ కూడా విడాకులు ఇస్తున్నానంటూ బాంబు పేలుస్తుందో ఏమో.. అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. అయితే నయన‌తారా అన్ ఫాలో చేసిన.. విగ్నేష్ శివన్‌ ఇంకా ఆమెను ఫాలో అవుతున్నాడు. సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు కూడా అలానే ఉన్నాయి. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారా.. లేదా టెక్నికల్ ఇష్యూస్ తోనే అలా జరిగిందా.. అనుకోకుండా అన్ ఫాలో చేసిందా.. అంటూ పలు సందేహాలు నేటిజన్స్ లో మొదలయ్యాయి. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరూ ఇటీవల పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ చివరిగా నయనతార తన భర్త సినిమాను చేయనని ఓపెన్ గా చెప్పేసింది. ఈ క్రమంలోనే విగ్నేష్ ను అన్ ఫాలో చేయడం పై నయన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.