ఈ నేచురల్ ఫేస్ వాష్ రెగ్యులర్ గా వాడితే మేకప్ లేకున్నా మెరిసిపోవడం ఖాయం..

ఇటీవల కాలంలో చిన్న నుంచి పెద్దవారి వరకు.. ప్రతి ఒక్కరు మేకప్ కు బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. మేకప్ లేకపోతే బయట కాలు పెట్టడం కూడా కష్టంగా మారింది. కానీ కొందరు మాత్రమే మేకప్ లేకపోయినా చాలా అందంగా కనిపిస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిని చూస్తే కాస్త జ‌ల్స్ రివ‌డం కామన్. అలా మేకప్ లేకపోయినా మెరిసిపోవాలనుకుంటున్నారా.. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను మీరు రెగ్యులర్ గా వాడితే సరిపోతుంది. ఇది మీ స్కిన్ గ్లోకు బాగా సహకరిస్తుంది. ఈ ఫేస్ వాష్ మరెన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీకు అందిస్తుంది. ఇంతకు ఈ నేచురల్ ఫేస్ వాష్ ను ఇంట్లో తయారు చేసుకోవడం ఎలానో ఒకసారి చూద్దాం.

ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ ముల్తాన్ని మట్టి, ఒక టేబుల్ స్పూన్ గులాబీ రేకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ బీట్‌రూట్ పొడి, ఒక టేబుల్ స్పూన్ వేపాకుల పొడి, అర టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపును తీసుకొని అన్ని మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. తరువాత దానిని ఒక సీసాలో ప్రిజర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫేస్ వాష్ పౌడర్ రెడీ అయిపోయినట్టే. ఈ పౌడర్ చర్మం మెరిసిపోవడానికి ఎంతగానో సహకరిస్తుంది. ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసుకుని ఫేస్ వాష్ ల ఉపయోగించాలి.

ఇలా రెగ్యులర్ గా నేచురల్ ఫేస్ వాష్ ను యూజ్‌ చేసుకోవడం వల్ల చర్మం లోతుల నుంచి శుభ్రం అవుతుంది. అలాగే స్కిన్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. చర్మంపై జిడ్డు ఫీలింగ్ పోయి.. నిగారిస్తుంది. బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి. టాన్ రిమూవ్ అవ్వడమే కాదు చ‌ర్మ ఛాయ మెరుగుపడుతుంది. అలానే ముదురు రంగు మచ్చలు ఏమైనా ఉన్నా కూడా ఈ నాచురల్ ఫేస్ వాష్ పౌడర్ తో మాయమవుతాయి. చర్మం నిగారింపుతో మెరిసిపోతూ కనిపిస్తుంది. ఈ నేచురల్ ఫేస్ వాష్ రెగ్యులర్ గా వాడారు అంటే మేకప్ లేకపోయినా ఆకర్షణీయంగా మెరిసిపోవడం ఖాయం. మీరు కూడా కచ్చితంగా ట్రై చేయండి.