ఆ మనిషి నేను వద్దన్నా వినడు.. ఆ వ్యక్తిపై కామెంట్స్ చేసిన సాయి పల్లవి..!

ఫిదా మూవీ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి ఫిదా సినిమాతో ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. స్టార్ హీరోయిన్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తుంది.

టాలీవుడ్ లో అడుగుపెట్టి నేచురల్ బ్యూటీగా పేరుపొందింది. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకపోయినా.పలు షోస్ కి హాజరవుతూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన తండ్రిపై కొన్ని ఆసక్తి గల వ్యాఖ్యలు చేసింది.సాయి పల్లవి మాట్లాడుతూ..మూవీలో షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళితే నీరసంగా కనిపించేది.

అప్పుడు నాన్న. అది గమనించి నా దగ్గరికి వచ్చి కాళ్లు పట్టుకునేవారు వద్దన్న వినేవారు కాదు పక్కాగా మసాజ్ చేసేవారు అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమె కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈమె వ్యాఖ్యలు చూసిన కొందరు.. గ్రేట్ ఫాదర్.. అంటూ కామెంట్స్ చేశారు.