తమన్నాకు కోపం వస్తే .. ముందు రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ పని చేస్తుందా ..?

మనిషి పుట్టుక పుట్టాక కోపం సహజం.. ఎవరికైనా సరే కోపం రాక మానదు . ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ కైనా ఎన్ని యోగాసనాలు వేసిన.. ఎంత మైండ్ కంట్రోల్లో పెట్టుకున్న కచ్చితంగా వాళ్ళకి కోపం వస్తుంది . ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా ఉన్న వాళ్ళకి కూడా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు .

అయితే హీరోయిన్ తమన్నా మాత్రం తన కోపాన్ని కంట్రోల్ చేసుకునే పద్ధతి చాలా వెరైటీగా ఉంది అంటున్నారు అభిమానులు. మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ దక్కించుకునింది. నిజానికి తమన్నకి కోపం చాలా రేర్ గా వస్తుందట . కానీ తమన్నాకి కోపం వచ్చిన ప్రతిసారి ఫస్ట్ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకొని ప్రశాంతంగా పడుకోడానికి ట్రై చేస్తుందట .

ఎవరితో మాట్లాడదట . ఇంకా ఆమెకు కోపం తగ్గకపోతే వెళ్లి కూల్ షవర్ చేస్తుందట. అప్పుడు కూల్ అయ్యాక బయటకు వచ్చి తన ప్రాబ్లం ఏంటో అందరికీ వివరిస్తుందట . ఇలా కోపాన్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు . ఇది చాలా ఫన్నీగా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ వెబ్ సిరీస్ చేస్తుంది . ఆమె చివరిగా తెలుగులో నటించిన సినిమా భోలాశంకర్ . ఇది డిజాస్టర్ కా బాప్ అనే రేంజ్ లో చెత్త రివ్యూస్ దక్కించుకునింది..!!