ఆ యంగ్ హీరో సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఖుషి కపూర్.. బోనీకపూర్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

ఎస్ ప్రెసెంట్ ఇన్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా టాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి టాలీవుడ్ ఇండస్ట్రీపై కన్ను వేస్తున్నారు . ఒక ముద్దుగుమ్మ ఒక సినిమా కి కమిట్ అయ్యి ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే మరో సినిమా కమిట్ అయ్యేలా తన అందచందాలతో మెప్పించేస్తుంది . రీసెంట్గా జాన్వీ కపూర్ దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది . ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే రామ్ చరణ్ సరసన క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసింది .

అంతేకాదు పుష్ప2లో కూడా భాగం కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఇప్పుడు చెల్లి కుషి కపూర్ వంతు వచ్చినట్లు తెలుస్తుంది . అక్కినేని అఖిల్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా ఖుషి కపూర్ నటించబోతుందట . ఈ సినిమా ద్వారానే తెలుగులో డెబ్యూ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. బోనీకపూర్ స్టార్ వారసుల సినిమాల ద్వారానే పిల్లల్ని ఎంట్రీ ఇప్పిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఆయన తెలివితేటలను పోగిడేస్తున్నారు .

అయితే వాళ్ళ కూతుర్ల పేర్లు పెద్దగా పబ్లిసిటీ దక్కించుకోవాలని ..స్టార్ వారసులు అయితే కాస్తో కూస్తో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని.. మిగతా సగం మ్యాటర్ వీళ్లు తమ అందాలతో ఒప్పించేస్తారు అని ..బోనీకపూర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలలో వార్తలు వైరల్ అవుతున్నాయ్. చూద్దాం మరి అఖిల్ -ఖుషి కపూర్ కాంబో ఎంత బాగా వర్క్ అవుట్ అవుతుందో..? అక్కినేని నాగార్జున – శ్రీదేవి కాంబో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . వీళ్ళ కాంబోపై అప్పట్లో జనాలు ఎలా మాట్లాడుకున్నారో కూడా మనకు తెలిసిందే..!!