“బుద్ధొచ్చింది..ఇకపై అలాంటి తప్పు ఎప్పటికి చేయను”.. అభిమానులకి ప్రామిస్ చేసిన హీరోయిన్ సమంత..!!

సమంత.. ఈమెకు సంబంధించిన వార్తలు ఎలా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఒకప్పుడు సమంతని పొగిడేసిన జనాలే ఇప్పుడు ఆమెను హద్దులు మీరి పోయి నోటికి వచ్చిన బూతు పదాలతో ట్రోల్ చేస్తూ ఉంటారు . అలాంటివి మొదట్లో సీరియస్ గా తీసుకున్న సమంత ఆ తర్వాత చాలా చాలా లైట్ గా తీసుకుంది. తన పని తాను చూసుకుంటా అంటూ దూసుకుపోతుంది .

రీసెంట్గా సమంత ఇండియా టుడే కాన్ క్లేవ్ లో పాల్గొనింది . ఈ క్రమంలోనే తన లైఫ్ కి సంబంధించిన విషయాలను బయటపెట్టింది. మయోసైటీస్ వ్యాధి వచ్చినప్పుడు తాను ఎంతలా సఫర్ అయ్యాను అనే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది . అంతేకాదు హోస్ట్ “ఊ అంటావా మామా లాంటి పాట మళ్ళీ చేస్తారా ..?”అంటూ ప్రశ్నించగా..” ఇక జన్మలో అలాంటిది మళ్లీ చేయను ..ఆ పాటలో లిరిక్స్ నాకు చాలా నచ్చాయి .. నాకు సవాలుగా అనిపించాయి ..అందుకే చేశాను ..మరోసారి ఆ రిస్క్ చేయను” అంటూ చెప్పుకొచ్చింది.

దీంతో అభిమానులు ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇకపై సమంతను ఐటమ్ సాంగ్ లో చూసే ఛాన్సే లేదు అంటూ తేల్చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ పరోక్షకంగానే హింట్ ఇస్తుంది సమంత . చూద్దాం మరి సమంత మాటలు అర్థం చేసుకున్న ఏ డైరెక్టర్ ఆమెకు అవకాశం ఇస్తారో..? కాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించి హీరోయిన్గా రష్మిక మందన్నా నటించిన సినిమా పుష్పలో సమంత ఐటెం సాంగ్ చేసింది . అప్పట్లో ఈ పాట ఓ రేంజ్ లో ఊపేసింది . ఇప్పటికి యూట్యూబ్లో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది ఈ పాట. ఏ పార్టీ అన్నా ఫంక్షన్ అన్నా ఆ పాట ఉండాల్సిందే..!!