ఎన్ బి కె 109 ఆఫర్ ని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. చివరిగా భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాలయ్య. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాకపోవడంతో ఎన్‌బికే109 ర‌నింగ్ టైటిల్‌తో సినిమాను రూపొందిస్తున్నారు.

NBK 109 : భారీ యాక్షన్ సీన్స్ తో మొదలు కానున్న బాలయ్య తరువాత సినిమా..? -  NTV Telugu

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోలో టాలీవుడ్ బ్యూటీ చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ ఫ్యాక్ట్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, ఫార్చునర్ సినిమాస్ పై సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థ‌మన్ మ్యూజికల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక బాలయ్య సినిమాలో కీలకపాత్రలో నటించే ఆఫర్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు.

Vishwak Sen's Words Becomes Hot Topic Once Again!

బాలయ్య సినిమాలో నటించే ఛాన్స్ దొరికితే చాలా వరకు ఎవరు రిజెక్ట్ చేసే అవకాశాలు ఉండవు. అలాంటిది యంగ్ హీరో విశ్వక్ సేన్.. బాలయ్య సినిమాలో నటించే ఛాన్స్‌ను రిజెక్ట్ చేశారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం విశ్వక్ సేన్‌ను అప్రోచ్ అయ్యారట డైరెక్టర్ బాబి. అయితే బాబి ఆ పాత్రను విశ్వక్ సేన్ రిజెక్ట్ చేశాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో బాలయ్య ఫ్యాన్స్ విశ్వక్ పై ఫైర్ అవుతున్నారు.