తారక్ రిజెక్ట్ చేసిన ఆ స్టోరీకి చరణ్ గ్రీన్ సిగ్నల్.. ఆ సినిమా వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా..?!

ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. అయితే ఈ మూవీ వచ్చి మూడు సంవత్సరాలు పూర్త‌వుతున్న ఇంకా చ‌ర‌ణ్‌ నుంచి సోలో మూవీ ఎక‌టి కూడా రాలేదు. ఈ క్ర‌మంలో రామ్ చరణ్ నుంచి నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆశ‌క్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్‌లో నటిస్తున్న గేమ్ చేంజర్ నుంచి కూడా క‌నిసం ఏ అప్డేట్స్ బ‌య‌ట‌కు రావ‌డం లేవు. ఈ క్ర‌మంలో తారక్, రామ్ చరణ్ గురించి ఓ లేటెస్ట్ న్యూస్ నెటింట తెగ చెక్క‌ర్లు కొడుతుంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ త‌న నెక్స్ట్‌ మూవీ చేయబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. కాగా ఈ కాంబోలో తెరకెక్కనున్న‌ మూవీకు ఆ భారీ టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా వచ్చిన వార్త సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Ram Charan, Jr NTR take scooty ride in Hyderabad (Video)

అయితే నిజానికి ఈ స్టోరీ జూనియర్ ఎన్టీఆర్ కోసం రెడీ చేశారట‌.. కానీ తార‌క్‌కు డేట్స్ కుదరకపోవడంతో ఆయ‌న నో చెప్పారని తెలుస్తుంది. మాంచి స్కోప్ ఉన్న మూవీ కావడంతో తారక్ ఈ క‌థ‌ను తన ఫ్రెండ్ చరణ్ దగ్గరకు పంపించినట్టు టాక్‌. అయితే ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలీదుకాని ఈ వార్త వైర‌ల్ అవ్వ‌డంతో దీని గురించి సోషల్ మీడియాలో అభిమానుల మ‌ధ్య‌ పెద్ద చెర్చ న‌డుస్తుంది. తార‌క్ ఫ్యాన్స్‌ మా హీరో వదిలేసిన కథ మీ హీరో చేస్తున్నారు అంటూ.. రామ్ చరణ్ ఫ్యాన్స్ మంచి కంటెంట్ ఉన్న మూవీ మీహీరో రిజ‌క్ట్ చేసి మంచి ఆఫ‌ర్ వ‌దిలేసాడంటూ సెటైర్లు వేస్తున్నారు. హీరోలు ఫ్రెండ్లీగా ఒక‌రితో ఒక‌రు బాగానే ఉంటారు. మధ్యలో వారి ఫ్యాన్స్‌ మాత్రం వాదోపవాదాలకు దిగుతున్నారు. ఈ మూవీ గురించి చెర్రీ, తారక్ ఫ్యాన్స్‌ మధ్య హాట్ డిస్కషన్ నెల‌కొంది. పెద్ది మూవీ నిజంగానే తారక్.. చెర్రీ కోసం పంపినట్లైతే.. అలా జ‌ర‌గ‌టం ఇదే మొద‌టిసారికాదు.

Ram Charan's next is with 'Upenna' director Buchi Babu Sana - The Hindu

ఎందుకంటే చాలా సందర్భాలలో ఒక హీరో వద్దకు వ‌చ్చిన సినిమాని క‌థ న‌చ్చిన న‌టించ‌లేని నేప‌ధ్యంలో మరొక హీరో వ‌ద్ద‌కు పంపిస్తూ ఉంటారు. ఆ మూవీలో న‌టించి మ‌రో హీరో బ్లాక్ బస్టర్ కొడ‌తారు. మహేష్ బాబు రికార్డ్ సృష్టించిన అతడు చిత్రం పవన్ కళ్యాణ్ వ‌దులుకున్నాడు. అలానే సుమంత్ నువ్వే కావాలి మూవీ ని రిజ‌క్ట్ చేశాడు.. ఇలా టాలీవుడ్‌లో బోలెడు ఉదాహరణలు క‌నిపిస్తాయి. రామ్ చరణ్ సినిమాకి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఇది వేరే స్టోరీ అని చెప్పిన వీడియో క్లిప్ ఒక‌టి చెర్రీ ఫ్యాన్స్ వెతికి.. తెగ‌ వైరల్ చేశారు. రామ్ చరణ్ కు ,జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య బాండింగ్ ఎలా ఉందో తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి తెలుసు. ఇద్దరూ అగ్ర హీరోలు అయినా కలిసి సినిమా న‌టించ‌డానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్య కథలు ఎవరి నుంచి ఎవరికీ వెళ్ళినా వాళ్ళ‌కు అది పట్టింపు ఉండదు.