టాలీవుడ్ లో బాలనట్టిగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది అవంతిక వందనపు. మహేష్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బ్యూటీ పేరు ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారింది. మనమంతా, ప్రేమమ్ సినిమాలు అవంతిక క్రేజ్‌ను రెట్టింపు చేశాయి. ప్రస్తుతం అవంతిక హీరోయిన్‌గా బిజీ లైఫ్ గడుపుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా మీన్ గర్ల్స్ సినిమాలో అవంతిక నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో అవంతిక ఎక్స్పోజింగ్ గురించి ఆమె ఆక్సంట్ గురించి తెగ ట్రోల్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం నెటింట ఆమె పేరు మారుమోగిపోతుంది. వాటి గురించి అవంతిక రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. అమ్మది హైదరాబాద్, నాన్నది నిజామాబాద్ నేను అమెరికాలోనే పుట్టి పెరుగా అంటూ ఆమె వివరించింది.
నాకు పదేళ్ళు ఉన్న టైంలో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యామని.. అవంతిక చెప్పుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీ ఆఫర్స్ రావడంతో ఐదేళ్లు ఇక్కడే ఉన్నామంటూ వివరించింది. నాకోసం అమ్మ జాబ్ కూడా వదిలేసిందని చెప్పుకొచ్చిన అవంతిక.. నేను అమెరికా ఆక్సెంట్‌లో మాట్లాడుతున్నానని నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. అంత దారుణంగా ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను అమెరికాలో పుట్టి పెరిగాను. కాబట్టి నా మాట, యాస అక్కడిలానే వస్తుంది. దానికి ట్రోల్స్ చేయడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది అంటూ వివరించింది. ట్రోల్స్ మనం కంట్రోల్ చేయలేం.. అయితే ఇంత దారుణమైన ట్రోలింగ్ నేను ఇప్పటివరకు అసలు చూడలేదు అంటూ అవంతిక వివరించింది.
అమెరికా లాంటి ప్లేసెస్ లో నేపొటిజం అసలు ఉండదని.. టాలెంట్‌ను బట్టే అవకాశాలు ఇస్తారని వివరించింది. అయితే నాకు ఇక్కడ హీరోయిన్గా రాణించాలనే కోరిక ఉందని.. సౌత్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసి స్టార్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నా అంటూ వివరించింది. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న అవంతిక.. టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటారేమో చూడాలి. ఇక ట్రోల్స్ ఎదురవుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో పెంచుకుంటుంది అవంతిక. ప్రస్తుతం అవంతిక చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో ట్రోల్స్ ను అసలు పట్టించుకోవద్దు.. తెలుగు అమ్మాయివై ఉండి హాలీవుడ్ రేంజ్ కు ఎదిగావంటే నువ్వు నిజంగానే గ్రేట్ అవంతిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.