రామ్ చరణ్ – బుచ్చిబాబు మూవీలో కీలకపాత్రలో ఆ స్టార్ హీరో.. అసలు గెస్ చేయలేరు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్ని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్టార్ క్రేజ్‌ సంపాదించుకున్న చరణ్.. వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ అయిన చెర్రీ. ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్‌ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది చివరిలోగా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కాసితో ఉన్నాడు చరణ్. ఆయన చివరిగా నటించిన ఆర్‌ఆర్‌ఆర్ పూర్తయి.. మూడు సంవత్సరాలు అయినా.. ఇంకా చరణ్ నుంచి సినిమా రాకపోవడంతో చరణ్ నుంచి వస్తున్న గేమ్ చేంజర్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Ram Charan's next is with 'Upenna' director Buchi Babu Sana - The Hindu

కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా.. పాన్ ఇండియా లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చరణ్.. గేమ్ చేంజర్‌ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్.. బుచ్చిబాబు డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై కూడా చరణ్ ఫోకస్ పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట‌. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు, చరణ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా లో ఓ సీనియర్ స్టార్ హీరో కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అతను ఎవరో కాదు టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్. రామ్ చరణ్ గేమ్ చేంజర్‌లో రాజశేఖర్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడట.

Rajasekhar's daughter set for cinematic debut - Hindustan Times

ఇక ఇప్పటికే నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో రాజశేఖర్ ఒక కీరోల్‌లో నటించినప్పటికీ సినిమా సక్సెస్ కాకపోవడంతో.. ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. ఇక ప్రస్తుతం చరణ్‌తో చేయబోయే ఈ సినిమాలో తన రోల్ కు మంచి గుర్తింపు రావాలనే ప్రయత్నాల్లో ఉన్నాడట రాజశేఖర్. ఇక నిజంగానే చరణ్, బుచ్చిబాబు సినిమాలో రాజశేఖర్ నటిస్తున్నాడో లేదో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. అయితే చిరంజీవి, రాజశేఖర్ ఫ్యామిలీల‌కి ఎప్పటినుంచో కొన్ని వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ సినిమాలో రాజశేఖర్ నటిస్తున్నాడు అంటూ వచ్చే వార్తలో నిజం ఉండదంటూ ఫ్యాన్స్ కొట్టి పాడేస్తున్నారు. కొందరు సీనియర్స్ సినీ మేధావులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే రాజశేఖర్‌కు ఈ సినిమాలో అవకాశం వచ్చినట్లయితే రాజశేక‌ర్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరింత కెరీర్ ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు.