ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. సలార్ 2లో సూపర్ ట్విస్ట్..

తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కాదు. రీసెంట్ గా స‌లార్‌ సినిమాతో రూ.800 కోట్ల కలెక్షన్ రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస‌ సినిమాలను రూపొందిస్తూ బిజీగా గడుతున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్‌, కల్కి సినిమాల్లో బిజీగా ఉన్న డార్లింగ్.. ఈ సంవత్సరం ఈ రెండు సినిమాలతో ప్రేక్షకుల‌ ముందుకు వచ్చి.. మరోసారి రికార్డులు బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఈ విజయాల పరంపరని కొనసాగించాలని ప్రభాస్ ఎంతో శ్రమిస్తున్నాడు.

ఈ సినిమాల కోసం భారీ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రశాంత్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పనుల్లో ప్రశాంత్ బిజీగా ఉండడం వల్ల ప్రభాస్ తో సలార్ 2ను.. ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తర్వాతే రూపొందిస్తాడంటూ తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం చాలామంది ప్రేక్షకులు ఆశ‌క్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న వార్తల ప్రకారం ప్రశాంత్ నీల్‌ సినిమాల్లో శృతిహాసన్‌కు సంబంధించి ఓ భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

SS Rajamouli, a huge fan of Shruti Haasan, is disappointed with Prashanth  Neel as Salaar has no dance numbers | Telugu News - The Indian Express

ఇక పార్ట్ 1లో హీరోయిన్గా చాలా కామ్ గా కనిపించిన శృతిహాసన్.. పార్ట్ 2 లో మాత్రం డిఫరెంట్ షేడ్స్ తో కనిపించనుందట. ఆమెను లండన్ నుంచి ఇండియా రావడానికి కూడా సపరేట్ కారణం ఉందని.. ఆ ట్విస్ట్ సలార్‌2లో ఏంటో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి ట్విస్ట్‌తో సినిమా రూపొందుతుంది అనే వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో.. సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌ పైకి వచ్చి రిలీజ్ అవుతుందో వేచి చూడాలి. అయితే సలార్‌2 రిలీజ్ అయితే మాత్రం సలార్ రికార్డులను బ్రేక్ చేసి మరింత భారీ కలెక్షన్లు రాబడుతుందంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.