సమంత కి కొత్త బిరుదు ఇచ్చిన జనాలు.. సామ్ రియాక్షన్ చూశారా..!

ఈ మధ్యకాలంలో సమంత పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుందో మనం చూసాం. రీసెంట్గా ఇండియా టుడే మీట్ లో పాల్గొన్న సమంత తనపై జరిగిన హ్యూజ్ ట్రోలింగ్ గురించి స్పందించింది . యశోద సినిమా ప్రమోషన్ టైం లో కన్నీరు పెట్టుకున్న విషయాలపై ఆమె ఓపెన్ గా స్పందించింది. సమంత హీరోయిన్గా యశోద సినిమాలో నటించింది . ఈ సినిమా ప్రమోషన్ టైంలో ఆమె ఎమోషనల్ గా ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడింది. దానికి సంబంధించిన పిక్చర్స్ బాగా వైరల్ అయ్యాయి .

అయితే కొందరు అవి చూసి సింపతి క్వీన్ అంటూ ఆమెను ట్రోల్ చేశారు. ఆ ట్రోల్లింగ్ పై రీసెంట్గా స్పందించింది సమంత . “నేను యశోద సినిమా ప్రమోషన్ టైం లో కన్నీరు పెట్టుకున్న క్లిప్స్ చూసి చాలామంది వెటకారంగా వ్యంగ్యంగా ట్రోల్ చేశారు .. అవి నాకు చాలా బాధ అనిపించింది.. నేను ఆ టైంలో ఎంత కష్టాన్ని అనుభవించానో ఎంత పెయిన్ భరించానో నాకు మాత్రమే తెలుసు ..”

“మయోసైటీస్ వ్యాధి ఉంది అని నేను మీకు చెప్పకపోయి ఉంటే ఇంకా ఇంకా నన్ను ట్రోల్ చేస్తుండేవారు .. నా బాధ గురించి ఆలోచించుకోకుండా నన్ను ట్రోల్ చేసిన వారి గురించి నేను పట్టించుకోను అంటూ చాలా ఓపెన్గా స్పందించింది”. అంతేకాదు హీరోయిన్ సమంత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది . త్వరలోనే బాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో మన ముందుకు రాబోతుంది సమంత అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక పోతుంది . వచ్చిన అరా కొరా కూడా ఆమెకు హీరోయిన్ గా కాకుండా వేరే పాత్రలు ఇస్తూ ఉండడం ఫాన్స్ కు ఇబ్బందికరంగా మారింది..!!